సపోర్ట్ తాడును కోసిన మహిళ.. ఎత్తైన భవనంపై వేలాడిన పెయింటర్స్

బ్యాంకాక్: ఎత్తైన బిల్డింగ్‌కు పెయింట్ వేస్తుండగా ఒక మహిళ తన ఇంటి మీదుగా వెళ్తున్న సపోర్ట్ తాడును కోసేసింది. దీంతో ఇద్దరు పెయింటర్లు 26వ అంతస్తు పైనుంచి ప్రమాదకరంగా వేలాడారు. థాయిలాండ్‌లోని పాక్ క్రెట్లో ఈ ఘటన జరిగింది. బుధవారం బహుళ అంతస్తుల నివాసిత భవనం వెలుపల పెయింట్ వేసేందుకు ఇద్దరు వ్యక్తులు సపోర్ట్ తాడు సహాయంతో 32వ అంతస్తు నుంచి పెయింట్ వేస్తూ కిందకు దిగుతున్నారు.
అయితే తమ ఫ్లోర్లో పెయింట్ వేస్తున్న సంగతి చెప్పకపోవడంపై ఒక మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఇంటి మీదుగా వెళ్తున్న సపోర్ట్ తాడును చాకుతో కోసివేసింది. దీంతో ఆ పెయింటర్లు 26వ అంతస్తుపైన గాల్లో వేలాడసాగారు. కిటికీ తెరువాలని అరిచారు. గమనించిన ఒక జంట వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో వారి ఇంటి బాల్కానీలోకి ఆ పెయింటర్లు సురక్షితంగా చేరుకున్నారు.
మరోవైపు సపోర్ట్ తాడును కోసిన మహిళను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యా యత్నం, ఆస్తికి నష్టం కలిగించడం వంటి ఆరోపణలపై కేసు నమోదు చేశారు. అయితే ఆ మహిళ తొలుత ఈ ఆరోపణలను ఖండించింది. దీంతో తెగిన తాడును ఫింగర్ ప్రింట్, డీఎన్ఏ అనాలిసిస్ కోసం ల్యాబ్‌కు పంపారు. చివరకు ఆ మహిళ తన తప్పును అంగీకరించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

