కోట్ల మంది ప్రాణాలు కాపాడిన లాక్డౌన్లు: ఆక్స్ఫర్డ్ అధ్యయనం

లండన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా విధించిన లాక్డౌన్లు కోట్ల మంది ప్రాణాలు కాపాడినట్లు తాజాగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నేతృత్వంలో నిర్వహించిన అధ్యయనం తేల్చింది. ఈ లాక్డౌన్లు బ్యాక్టీరియా రోగాలైన నిమోనియా, మెనింగిటిస్, సెప్సిస్లాంటి వాటిని భారీగా తగ్గించగలిగాయని స్పష్టం చేసింది. క్రైస్ట్‌చర్చ్‌లోని ఒటాగో యూనివర్సిటీ డీన్, అంటువ్యాధుల నిపుణుడు ప్రొఫెసర్ డేవిడ్ మర్దోక్‌తో కలిసి ఆక్స్ఫర్డ్ ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ వ్యాధుల సంక్రమణ తగ్గిపోవడం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలు కూడా నిలిచాయని ఇందులో తేల్చారు. బ్యాక్టీరియా వల్ల కలిగే ఈ మూడు రోగాల వల్లే ఏటా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది చనిపోతుంటారు. ముఖ్యంగా పిల్లలు, వయసు మళ్లిన వారిపై వీటి ప్రభావం ఎక్కువ.
కరోనా వైరస్‌లాగే ఈ వ్యాధికారకాలు కూడా శ్వాసకోశ మార్గం ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఒక్క 2016 ఏడాదిలోనే 3.36 కోట్ల మంది ఈ వ్యాధుల బారిన పడగా.. అందులో 24 లక్షల మంది చనిపోయారు. గతేడాది జనవరి నుంచి మే మధ్య ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల సంఖ్య భారీగా తగ్గిందని ఈ అధ్యయనం గుర్తించింది. అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే.. సగటును ఒక్కో దేశంలో 6 వేల మేర కేసులు తక్కువగా నమోదైనట్లు తేల్చింది. అయితే ఈ లాక్డౌన్లు శ్వాసకోశేతర బ్యాక్టీరియా జాతుల వల్ల కలిగే వ్యాధులను మాత్రం తగ్గించలేదని ఈ అధ్యయనంలో తేలింది.
కొవిడ్ లాక్డౌన్ విధించిన నాలుగు వారాల్లోనే స్ట్రెప్టోకోకస్ నిమోనియా ఇన్ఫెక్షన్ల సంఖ్య 68 శాతం మేర తగ్గిపోయినట్లు గుర్తించారు. ఈ లాక్డౌన్ల కారణంగా ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాధి సంక్రమించకపోవడంతో వీటి సంఖ్య భారీగా తగ్గినట్లు అధ్యయనం తేల్చింది. కొవిడ్ ఆంక్షలను సడలించిన తర్వాత ఈ వ్యాధులకు వ్యాక్సిన్లు వేయాలని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఆరు ఖండాల్లోని 26 దేశాల జాతీయ లేబొరేటరీల నుంచి అందిన డేటాను పరిశీలించి రీసెర్చర్లు ఈ అభిప్రాయానికి వచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

