హాస్పిటల్ రూఫ్‌పై 200 మృతదేహాలు.. పాక్‌లో కలవరం రేపిన ఘటన
dead bodies on hospital roof:పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ముల్తాన్‌లో నిస్తార్ హాస్పిటల్లో సుమారు 200 మృతదేహాలు మార్చురీలో పడి ఉన్న ఘటన కలవరం రేపింది. ఆ రాష్ట్ర సీఎం సలహాదారు తారిక్ జమాన్ గుజ్జార్ ఆ మార్చురీకి వెళ్లి కుళ్లిపోయిన మృతదేహాలను గుర్తించారు. హాస్పిటల్ విజిట్‌కు వెళ్లిన గుజ్జార్‌కు ఓ వ్యక్తి మార్చురీలో పడి ఉన్న మృతదేహాల గురించి ఫిర్యాదు చేశాడు. అయితే ఆ వెంటనే సీఎం సలహాదారు గుజ్జార్ మార్చురీ
ముల్తాన్: పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ముల్తాన్‌లో నిస్తార్ హాస్పిటల్లో సుమారు 200 మృతదేహాలు మార్చురీలో పడి ఉన్న ఘటన కలవరం రేపింది. ఆ రాష్ట్ర సీఎం సలహాదారు తారిక్ జమాన్ గుజ్జార్ ఆ మార్చురీకి వెళ్లి కుళ్లిపోయిన మృతదేహాలను గుర్తించారు. హాస్పిటల్ విజిట్‌కు వెళ్లిన గుజ్జార్‌కు ఓ వ్యక్తి మార్చురీలో పడి ఉన్న మృతదేహాల గురించి ఫిర్యాదు చేశాడు. అయితే ఆ వెంటనే సీఎం సలహాదారు గుజ్జార్ మార్చురీ వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. అక్కడ పడి ఉన్న మృతదేహాలను చూసి ఆయన చలించిపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. మెడికల్ స్టూడెంట్స్ ఆ మృతదేహాలను పరీక్షల కోసం వాడినట్లు తెలుస్తోంది. ఆడ, మగ మృతదేహాలు మార్చురీతో పాటు మార్చురీ రూఫ్‌పై కూడా పడి ఉన్నాయి. శరీరంపై బట్టలు లేకుండా చెల్లాచెదురుగా ఆ మృతదేహాలు పడి ఉన్న తీరు తీవ్ర ఆందోళన కలిగించింది. ఆ మృతదేహాల గురించి ఆరా తీయగా.. వాటిని మెడికల్ స్టూడెంట్స్ వాడినట్లు తెలిసింది.
రూఫ్‌పై ఉన్న మృతదేహాలకు కూడా బట్టలులేవు. డేగలు, పక్షులు ఆ మృతదేహాలను ఆహారంగా స్వీకరిస్తున్నట్లు తెలిసింది. మెడికల్ స్టూడెంట్స్ ఆ మృతదేహాలను వాడిన తర్వాత సరైన రీతిలో డీకంపోజ్ చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. నిస్తార్ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఈ ఘటనపై స్పందించింది. మృతదేహాలను వదిలేసిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

