ఉక్రెయిన్పై డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా.. ఒడెస్సా రీజియన్లో అంధకారం
Ukraine | ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోని ప్రముఖ రేవు పట్టణమైన ఒడెస్సాపై శుక్రవారం రాత్రి కామికాజీ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో నగరంతోపాటు ఒడెస్సా రీజియన్లో విద్యుత్
కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోని ప్రముఖ రేవు పట్టణమైన ఒడెస్సాపై శుక్రవారం రాత్రి కామికాజీ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో నగరంతోపాటు ఒడెస్సా రీజియన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మొత్తం 10 లక్షల 50 వేల మందికి పైగా అంధకారంలో చిక్కుకుపోయారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలంటే మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇరానియన్ డ్రోన్లతో అర్ధరాత్రి వేల రస్యా సైన్యం దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విమర్శించారు. రెండు డ్రోన్లను తమ సైనికులు కూల్చివేశారని వెల్లడించారు. డ్రోన్ దాడితో ఒడెస్సా రీజియన్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, కేవలం దవాఖానలు, ప్రసూతి వార్డుల వంటి అత్యవసర విభాగాలకు మాత్రమే కరెంటు అందిస్తున్నామని చెప్పారు. పరిస్థితి తీవ్రమైనదే అయిన ప్రస్తుతం అదుపులోనే ఉన్నదని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

