Vladimir Putin | పుతిన్‌పై రష్యాలో వ్యతిరేకత.. అయినా, ఆన్లైన్ ఓటింగ్ చట్టానికి ఆమోదం
రష్యాలో ఎన్నికల సమయంలో ఆన్లైన్ ఓటింగ్‌ను అనుమతించే చట్టాన్ని పుతిన్ ఆమోదించారు. ఈ చట్టం ఆమోదంపై రష్యాలో చాలా వ్యతిరేకత ఉన్నది. ఈ చట్టంతో ప్రత్యర్థుల ఎన్నికను...
మాస్కో : ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. తన సొంత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిరసనలను ఎదుర్కొంటున్నారు. పుతిన్ కూడా అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. అయితే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా పైచేయి సాధించాలన్న పట్టదలతో ఉన్న పుతిన్.. అందుకు తగినట్లుగా సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎంతగా వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ పట్టించుకోకుండా వివాదాస్పద చట్టంపై సంతకం చేశారు. రష్యాలో ఎన్నికల సమయంలో ఆన్లైన్ ఓటింగ్‌ను అనుమతించే చట్టాన్ని పుతిన్ ఆమోదించారు. ఈ చట్టం ఆమోదంపై రష్యాలో చాలా వ్యతిరేకత ఉన్నది. ఈ చట్టంతో ప్రత్యర్థుల ఎన్నికను తారుమారు చేసేందుకు, అధికారాన్ని నిలుపుకోవడం పుతిన్ సులువుగా ఉంటుందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. రష్యాను నియంతృత్వం దిశగా తీసుకెళ్లేందుకు ఇదొక ముందడుగుగా అక్కడి వారు భావిస్తున్నారు.
నిజానికి ఆన్లైన్ ఓటింగ్ కోసం పుతిన్ సంతకం చేసిన ఈ చట్టం, ఈ-ఓటింగ్ సదుపాయాన్ని గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఉపయోగించారు. తర్వాత ఈ సదుపాయాన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు ఈ-ఓటింగ్‌ను తప్పుబట్టారు. ఈ వెసులుబాటు ద్వారా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఓటమిపాలైన వారు ఆరోపించారు. ఓడిపోయిన అభ్యర్థులంతా కలిసి ఈ చట్టానికి వ్యతిరేకంగా గ్రూపుగా ఏర్పడి.. ఎన్నికల ఫలితాలను కోర్టులో సవాలు చేశారు. ఆన్లైన్ ఓటింగ్ వ్యవస్థ అక్రమాలకు అవకాశాలను పెంచుతుందని ప్రతిపక్షం కూడా పేర్కొన్నది.
ఇలాఉండగా, ఈ చట్టం తేవడానికి ముందు పైరసీని చట్టబద్ధంగా ఆమోదించే చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం, పాశ్చాత్య పేటెంట్ హోల్డర్ల అనుమతి లేకుండానే వారి వస్తువులు, సేవలను రష్యా కాపీ చేసుకోవచ్చు. అదే సమయంలో, ఏ దేశం మేధో సంపత్తికి కూడా ఎలాంటి డబ్బు చెల్లించకుండానే ఉపయోగించుకునే వీలు కల్పించారు. ఇప్పుడు రష్యాలో ఇతర దేశాల సినిమాలు, గేమ్‌లు, టీవీ షోలు, సాఫ్ట్వేర్ కోసం సంబంధిత కంపెనీ లేదా సంస్థకు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు నకిలీ వార్తలకు జైలు శిక్ష విధించే చట్టంపై కూడా పుతిన్ సంతకం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

