ఒకే ఒక్కడు.. విమానంలో ఒకే ప్యాసెంజర్.. 8 గంటల పాటు ప్రయాణం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఎక్కడికైనా వెళ్లినప్పుడు.. ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒంటరిగా ఉండటం అంత నరకం ఇంకోటి ఉండదు. ముఖ్యంగా ప్రయాణాల్లో అయితే చాలా బోర్ కొడుతుంటుంది. అందుకే పక్క సీట్లలో ఉండేవాళ్లతోనో లేక.. మనతో పాటు ప్రయాణం చేసేవాళ్లతో సరదాగా మాట్లాడుతూ ఉంటే టైమ్ పాస్ అవుతుంది. ప్రయాణం చేసిన ఫీలింగ్ కూడా ఉండదు.
అది ఏప్రయాణం అయినా సరే.. బస్సు కావచ్చు.. రైలు కావచ్చు.. విమానం కావచ్చు.. ఒంటరి ప్రయాణాన్ని ఊహించుకోవడమే కష్టం. కానీ.. ఓ వ్యక్తి మాత్రం ఒంటరిగా విమానంలో 8 గంటల పాటు ప్రయాణించాల్సి వచ్చింది. యూకే నుంచి యూఎస్ వరకు ఒంటరిగా ఆ వ్యక్తి ప్రయాణించాల్సి వచ్చిందట. ఒక్కడినే ఉన్నా.. విమానంలో ఒక్కడినే ప్రయాణించా అంటూ వీడియో తీసి దాన్ని తన టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ అయింది.
విమానం ఎక్కాక కానీ అతడికి తెలియలేదట… ఆ విమానంలో అతడొక్కడే ప్రయాణించాడని. విమానంలో ఉన్న ప్యాసెంజర్ల కంటే పైలట్సే ఎక్కువగా ఉన్నారని క్యాబిన్ క్రూ అతడితో చెప్పారట. ఇక చేసేదేం లేక.. అతడు క్యాబిన్ క్రూతోనే కాసేపు మాట్లాడి వాళ్లతో కలిసి మూవీస్ చూశాడట. వాళ్లతోనే కలిసి స్నాక్స్ కూడా తిన్నాడట. అయితే.. క్యాబిన్ క్రూ మాత్రం అతడిని బాగా చూసుకున్నారట. ఎంత ఫుడ్ కావాలంటే అంత ఫుడ్ అందించారట.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

