బంపర్ ఆఫర్ : ఈ దీవిలో పనిచేసే జంటకు రూ 88 లక్షల వేతనం!

న్యూఢిల్లీ : ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఓ దీవిలో మీతో పాటు మీరు ప్రేమించే వారు గడపటం ఆపై ఏడాదికి భారీ మొత్తం వేతనంగా అందుకుంటే..ఆ ఆలోచనే ఆహ్లాదంగా అనిపిస్తుంది ఎవరికైనా.. అయితే ఇప్పుడు ఇలాంటి అవకాశం ఓ జంట తలుపు తడుతోంది. బహమాస్ లోని ఓ ఐలాండ్ ను చూసుకునే దంపతులకు ఏటా ఏకంగా రూ 88 లక్షలు చెల్లించేందుకు ఆ ప్రైవేట్ దీవి యజమానులు ముందుకొచ్చారు. మరి ఈ దీవిని చూసుకుంటూ ఎంజాయ్ చేయడమే కాదు దాని యజమాని కుటుంబానికి చెందిన ఫ్లోరిడా, బహమస్ లలో ఉన్న వారి ఇండ్లలో కూడా పనిచేయాల్సి ఉంటుంది. పోలో అండ్ ట్వీడ్ లో ఈ జాబ్ కోసం ప్రకటన వెలువడిన వెంటనే ఎంతో మంది దరఖాస్తు చేసుకున్నారు. రూ 88 లక్షల వార్షిక వేతనంతో పాటు హెల్త్ కేర్ సదుపాయాలు, కారు వంటి సౌకర్యాలు కల్పిస్తారు.
ఎంపికైన జంట సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పనిచేయాలి. వీకెండ్స్ లో ఎలాంటి పని ఉండదు. ఇక ఈ జాబ్ డిస్క్రిప్షన్ లో ఇంటి పనులు, నిర్వహణలో నైపుణ్యంతో పాటు భవన నిర్వహణ, కాంట్రాక్టర్లతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని పొందుపరిచారు. వంట చేయడం అదనపు అర్హత అని, అతిథులను ఎయిర్ పోర్ట్ నుంచి పికప్ చేసుకోవడం వంటి పనులకు డ్రైవింగ్ లో నైపుణ్యం ఉండాలని కోరారు. ఇతర ప్రాపర్టీల్లో పనిచేయాల్సి వచ్చినా దంపతులిద్దరూ ఒకేచోట ఉండే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఏప్రిల్ 28న ఈ ప్రకటన రాగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు జంటలు ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

