Crime news | అమెరికాలో భారత సంతతి మహిళను కాల్చిచంపిన దుండగుడు
Crime news | అమెరికా (USA) లో భారత సంతతి మహిళ దారుణ హత్యకు గురయ్యారు. వర్జీనియా (Varginia) లోని ఓ సూపర్‌మార్కెట్ (Super Market) లో పనిచేస్తున్న గుజరాతీ మహిళ (Gujarati Woman) పై దుండగుడు కాల్పులు జరిపి హతమార్చాడు. దోపిడీ యత్నంలో ఈ ఘాతుకం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Crime news : అమెరికా (USA) లో భారత సంతతి మహిళ దారుణ హత్యకు గురయ్యారు. వర్జీనియా (Varginia) లోని ఓ సూపర్‌మార్కెట్ (Super Market) లో పనిచేస్తున్న గుజరాతీ మహిళ (Gujarati Woman) పై దుండగుడు కాల్పులు జరిపి హతమార్చాడు. దోపిడీ యత్నంలో ఈ ఘాతుకం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మృతురాలి కుటుంబసభ్యులు ధృవీకరించారు. మృతురాలిని మేఘనాబెన్ పటేల్ (Meghan Ben Patel) గా గుర్తించారు. ఆమె గుజరాత్‌లోని మెహసానా జిల్లా, విసాపూర్ తాలూకాలోని జంత్రాల్ గ్రామానికి చెందినవారు.
గడిచిన పదేళ్లుగా మేఘన వర్జీనియాలోని సూపర్మార్కెట్లో పనిచేస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు కర్సన్భాయ్ పటేల్, కపిలాబెన్ ప్రస్తుతం జంత్రాల్ గ్రామంలోనే నివసిస్తున్నారు. కాగా మేఘన హత్య ఘటన స్టోర్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. వీడియోలోని దృశ్యాల ఆధారంగా జంతువుల చర్మం ప్రింట్ ఉన్న ప్యాంటు, గ్రే జాకెట్ ధరించిన ఓ వ్యక్తి ముఖానికి ముసుగుతో స్టోర్‌లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో స్టోర్‌లో జనం ఎవరూ లేరు. అతను నేరుగా కౌంటర్ వద్దకు వచ్చి మేఘనాబెన్‌తో మాటలు కలిపాడు. కొద్దిసేపటి తర్వాత అనూహ్యంగా జేబులోంచి తుపాకీ తీసి ఆమెపై కాల్పులు జరిపాడు.
దాంతో ఆమె కిందపడిపోగానే నిందితుడు కౌంటర్ పైనుంచి లోపలికి దూకి ఆమెపైకి వంగి మరిన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు. అనంతరం నిందితుడు వచ్చిన దారిలోనే పరారయ్యాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మేఘనాబెన్‌కు భర్త ఉపేంద్రభాయ్ పటేల్, కుమార్తె నక్షీబెన్, కుమారుడు స్మిత్ ఉన్నారు. ఈ ఘటనతో అమెరికాలోని భారతీయ సమాజంలో విషాదం నెలకొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

