Omicron | మరో దేశంలో నమోదైన ఒమిక్రాన్ మరణం
Omicron | ఒమిక్రాన్ వేరియంట్ మరో దేశంలో ఒకరిని బలిగొన్నది. ఇప్పటికే పలు దేశాలకు పాకిన ఈ కొత్త కరోనా వేరియంట్.. ఇప్పటికే యూకే, యూఎస్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో కొందరి

ఒమిక్రాన్ వేరియంట్ మరో దేశంలో ఒకరిని బలిగొన్నది. ఇప్పటికే పలు దేశాలకు పాకిన ఈ కొత్త కరోనా వేరియంట్.. ఇప్పటికే యూకే, యూఎస్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో కొందరి ప్రాణాలు తీసింది. వీటిలో యూకేలో అత్యధికంగా ఒమిక్రాన్ కారణంగా 12 మంది మృత్యువాత పడ్డారు. యూఎస్, ఇజ్రాయెల్ దేశాల్లో ఒక్కో ఒమిక్రాన్ మరణం నమోదైంది.
ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాలో తొలి ఒమిక్రాన్ మరణం వెలుగు చూసింది. ఆస్ట్రేలియాలో కొత్తగా ఆరు కరోనా మరణాలు నమోదవగా.. వాటిలో ఒమిక్రాన్ మరణం ఒకటి ఉండటం ప్రజలను కలవరపెడుతోంది. రెండో డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ఒక 80 ఏళ్ల వృద్ధుడికి ఒమిక్రాన్ సోకిందని అధికారులు తెలిపారు.
సిడ్నీలోని వయోవృద్ధుల కేర్ సదుపాయంలో ఈ వృద్ధుడికి ఒమిక్రాన్ సోకినట్లు తెలుస్తోంది. అప్పటికే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ వృద్ధుడు తాజాగా ఒమిక్రాన్ ధాటికి కన్నుమూశాడు. దీంతో అధికారికంగా ఒమిక్రాన్ మరణాలు నమోదైన దేశాల సంఖ్య నాలుగుకు చేరింది. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి అంత వేగంగా లేని కారణంగా కరోనా ఆంక్షలను కఠినతరం చేసేందుకు అధికారులు నిరాకరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

