Plastic Waste | కాన్బెర్రా, ఏప్రిల్ 7: సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎంతమేరకు ఉన్నాయన్న విషయాన్ని నిపుణులు తొలిసారి అంచనా వేశారు. ప్లాస్టిక్ రిజర్వాయర్‌గా సముద్రాలు మారాయని, 30 లక్షల టన్నుల నుంచి 1.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రం లోపల పేరుకుపోయాయని ఆస్ట్రేలియా జాతీయ సైన్స్ ఏజెన్సీ, యూనివర్సిటీ ఆఫ్ టొరొంటో పరిశోధకుల తాజా అధ్యయనం లెక్కతేల్చింది.
ప్రతి నిమిషం ఓ ట్రక్ సైజ్‌లో ప్లాస్టిక్ సముద్రంలో కలుస్తున్నదని వీరి నివేదిక అంచనావేసింది. సీనియర్ పరిశోధకుడు డెనిస్ హార్డెస్టీ మాట్లాడుతూ, ‘ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రం లోపల ఎంతుందన్నది తెలిపిన తొలి పరిశోధన ఇది. ప్లాస్టిక్ వ్యర్థాలకు సముద్రాలు రిజర్వాయర్‌గా మారాయి. మైక్రో ప్లాస్టిక్ కాకుండా సంచులు, వలలు, కప్పులు.. మొదలైనవి ఎంతమేరకు ఉన్నాయన్నది తెలుసుకున్నాం’ అని చెప్పారు.