Justin Trudeau | కెనడా ప్రధాని ట్రూడో సంకేతాలు.. భవిష్యత్ రాజకీయాలకు రాంరాం..
Justin Trudeau | కెనడా ప్రధానిగా రాజీనామా చేసిన జస్టిన్ ట్రూడో క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని సంకేతాలిచ్చారు.
Justin Trudeau | కెనడా ప్రధానిగా రాజీనామా చేసిన జస్టిన్ ట్రూడో క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని సంకేతాలిచ్చారు. వచ్చే అక్టోబర్‌లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోనని గురువారం తెలిపారు. ఒట్టావాలో జరిగిన మీడియా సమావేశంలో ట్రూడో మాట్లాడుతూ ‘వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయబోను. ఇది నా నిర్ణయం’ అని చెప్పారు. కెనడా ప్రావిన్షియల్ ప్రధానులతో సమావేశం తర్వాత ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ హయాంలో పాలన, పన్నుల వ్యవస్థతో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో జస్టిన్ ట్రూడో చర్చించారు. 2008 నుంచి కెనడా పార్లమెంట్ సభ్యుడిగా పని చేశారు. నాటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ 50.3 శాతం ఓటింగ్ పొందిన జస్టిన్ ట్రూడో.. చివరిగా 2021లో విజయం సాధించారు. తన భవిష్యత్ గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయం లేదని, తనకు కెనడియన్లు ఇచ్చిన సమయంలో వారి కోసం అసాధారణ సేవలు అందించానని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

