North Korea: దక్షిణ కొరియాపై చెత్త బెలూన్లను జారవిడిచిన ఉత్తర కొరియా
North Korea: దక్షిణ కొరియా సరిహద్దు ప్రావిన్సుల్లో చెత్తతో కూడిన బెలూన్లను ఉత్తర కొరియా జార విడిచింది. సుమారు 150 భారీ బెలూన్లను దక్షిణ కొరియాలో పడేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఇండ్లలోనే ఉండాలంటూ సౌత్ కొరియా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ప్యోంగ్యాంగ్: చెత్తతో కూడిన బెలూన్లను దక్షిణ కొరియాలో ఉత్తర కొరియా(North Korea) జార విడిచింది. సుమారు 150 భారీ బెలూన్లను దక్షిణ కొరియాలో పడేసినట్లు తెలుస్తోంది. ప్రజలందరూ ఇండ్లలోనే ఉండాలంటూ సౌత్ కొరియా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర కొరియా వదిలిన తెలుపు రంగు బెలూన్లను ఎవరూ టచ్ చేయరాదు అని దక్షిణ కొరియా మిలిటరీ తన వార్నింగ్‌లో పేర్కొన్నది. ఆ బెలూన్లలో చెత్త, మలం ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియాలోని సుమారు 8 ప్రావిన్సుల్లో ఆ బెలూన్లను గుర్తించారు. అధికారులు ఆ బెలూన్లను స్టడీ చేస్తున్నట్లు దక్షిణ కొరియా తెలిపింది. కొరియా యుద్ధం జరిగిన 1950 నుంచి రెండు దేశాల మధ్య బెలూన్లను తమ ప్రచారం కోసం వాడుకునేవారు. బోర్డర్ ప్రాంతాల్లో కరపత్రాలను దక్షిణ కొరియా జారవిడుస్తోందని, అలా చేస్తే తాము ఊరుకోబోమని ఉత్తర కొరియా ఇటీవల వార్నింగ్ కూడా ఇచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

