Ales Bialiatski:నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు 10 ఏళ్ల జైలు శిక్ష
Ales Bialiatski:నోబెల్ పీస్ ప్రైజ్ గెలిచిన బెలారస్ సామాజిక కార్యకర్త అలెస్ బియాలిస్కీకి పదేళ్ల జైలు శిక్ష వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలను చేపట్టినందుకు ఆయన్ను శిక్షించారు.
న్యూఢిల్లీ: బెలారస్‌కు చెందిన నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ అలెస్ బియాలిస్కీ(Ales Bialiatski)కి పదేళ్ల జైలుశిక్ష విధించారు. 2022 నోబెల్ శాంతి బహుమతి(Nobel Peace Prize)ని గెలుచుకున్న ముగ్గురిలో అలెస్ బియాలిస్కీ ఒక్కరు. నోబెల్ అవార్డు గ్రహీతను బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో(Alexander Lukashenko) ఇబ్బందిపెడుతున్నట్లు ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
వివాదాస్పద ఎన్నికలకు వ్యతిరేకంగా 2021లో జరిగిన ప్రదర్శనల సమయంలో అలెస్ బియాలిస్కిని అరెస్టు చేశారు. నిరసనల కోసం ప్రతిపక్షాలకు నిధులను మళ్లించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 2020 నుంచి లుకషెంకోకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో పాల్గొంటున్నవారిని అరెస్టు చేస్తూనే ఉన్నారు.
వాలెంటిన్ స్టెఫానోవిచ్, వ్లాదిమిర్ లబ్కోవిచ్లకు కూడా జైలు శిక్ష పడింది. స్టెఫానోవిచ్‌కు తొమ్మిదేళ్లు, లబ్కోవిచ్కు ఏడేళ్ల శిక్ష ఖరారైంది. వియస్నా మానవ హక్కుల గ్రూపును అలెస్ బియాలిస్కీ 1996లో స్థాపించిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

