Nobel Prize in Chemistry: కెమిస్ట్రీ నోబెల్ పురస్కారాన్ని పంచుకున్న ముగ్గురు శాస్త్రవేత్తలు
Nobel Prize in Chemistry : రసాయన శాస్త్రంలో ఈ యేటి నోబెల్ పురస్కారాన్ని ముగ్గురు పంచుకున్నారు. ప్రొటీన్ డిజైన్, స్ట్రక్చర్‌పై వర్క్ చేసిన శాస్త్రవేత్తలకు ఆ అవార్డు దక్కింది. సగం భాగం అవార్డు డేవిడ్ బేకర్‌కు దక్కగా, మరో సగం భాగం ఇద్దరు శాస్త్రవేత్తలకు దక్కింది.
స్టాక్‌హోమ్: రసాయశాస్త్రంలో ఈ యేటి నోబెల్ పురస్కారాన్ని(Nobel Prize in Chemistry) ప్రకటించారు. అయితే ఆ అవార్డును ఈసారి ముగ్గురు శాస్త్రవేత్తలు పంచుకున్నారు. నోబెల్ పురస్కారంలో సగం భాగం డేవిడ్ బేకర్ శాస్త్రవేత్తకు లభించింది. కాంపుట్యూషనల్ ప్రొటీన్ డిజైన్ చేసినందుకు అతనికి ఆ అవార్డును ప్రకటించారు. ఇక మరో సగం అవార్డును ఇద్దరు శాస్త్రవేత్తలకు ఇచ్చారు. ప్రొటీన్ నిర్మాణాన్ని అంచనా వేసిన డేమిస్ హస్సాబిస్, జాన్ ఎం జంపర్లకు సగం నోబెల్ పురస్కారాన్ని కేటాయించారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇవాళ కెమిస్ట్రీ అవార్డు విజేతలను ప్రకటించింది.
BREAKING NEWS
The Royal Swedish Academy of Sciences has decided to award the 2024 #NobelPrize in Chemistry with one half to David Baker “for computational protein design” and the other half jointly to Demis Hassabis and John M. Jumper “for protein structure prediction.” pic.twitter.com/gYrdFFcD4T— The Nobel Prize (@NobelPrize) October 9, 2024
ఈ యేటి నోబెల్ విజేతలు.. ప్రోటీన్లలో దాగిన సీక్రెట్లను పసికట్టారు. కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రోటీన్ల రహస్యాలను బయటపెట్టారు. డెమిస్, జాన్‌లు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాదాపు అన్ని ప్రోటీన్లను స్టడీ చేశారు. రసాయనశాస్త్రంలో ఇప్పటి వరకు నోబెల్ పురస్కారాన్ని 115 సార్లు ప్రకటించారు. ఆ అవార్డును 194 మంది సొంతం చేసుకున్నారు. 1901 నుంచి 2023 వరకు కెమిస్ట్రీలో నోబెల్ పురస్కారాన్ని అందజేశారు. ఫ్రెడ్రిక్ సాంగర్, బ్యారీ షార్ప్లెస్ శాస్త్రవేత్తలు రెండు సార్లు కెమిస్ట్రీలో అవార్డులను అందుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

