ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవద్దు… బోర్డులు ఏర్పాటు చేసిన గ్రామస్తులు
16వ శతాబ్దానికి చెందిన నార్ఫోక్ హాల్ ఖరీదైన వివాహాలు, వేడుకలకు కేంద్రంగా మారింది. గత కొంత కాలం వరకు తక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు జరిగేవి.
బ్రిటన్: మితిమీరుతున్న పెళ్లిళ్లపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవద్దంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. బ్రిటన్లోని ఉత్తర నార్ఫోక్లో ఈ సంఘటన జరిగింది. ఇక్కడి చారిత్రక ఆక్స్నీడ్ హాల్ ఎస్టేట్ ఉన్నత స్థాయి వివాహాలు, పార్టీలు, సందడికి ప్రత్యేక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. అయితే, వివాహాలు, వేడుకల సందర్భంగా తమ తోటలలో మూత్ర విసర్జన చేసి వాటిని నాశనం చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. అలాగే మ్యూజిక్ వల్ల రాత్రి పూట తమకు నిద్రపట్టడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ‘ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవద్దంటూ’ బోర్డులు ఏర్పాటు చేశారు. వధువరులకూ స్వాగతం పలకబోమని హెచ్చరించారు. ఈ ఏడాది వందకుపైగా పెళ్లిళ్లు జరిగాయని, ఇక చాలని అందులో పేర్కొన్నారు.
16వ శతాబ్దానికి చెందిన నార్ఫోక్ హాల్ ఖరీదైన వివాహాలు, వేడుకలకు కేంద్రంగా మారింది. గత కొంత కాలం వరకు తక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు జరిగేవి. అయితే కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక మాంద్యం నుంచి కోలుకునేందుకు అపరిమిత సంఖ్యలో పెళ్లిళ్లు, వేడుకలకు స్థానిక పాలక మండలి అనుమతించింది. దీంతో లెక్కకు మించి పెళ్లిళ్లు, వేడుకలు జరుగుతున్నాయి.
మరోవైపు ఈ ఎస్టేట్ పక్కనే 500 ఎకరాల ఫార్మ్ కలిగిన సుసి, రోజర్ క్రేన్ ఈ పెళ్లిళ్లు, వేడుకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీవితంపై ఇవి ప్రభావం చూపుతున్నాయని వాపోయారు. పెళ్లికి వచ్చే అతిథులు తమ తోటల్లో తిరుగుతూ మూత్ర విసర్జన చేసి వాటిని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే మ్యూజిక్ వల్ల రాత్రి వేళ తమకు నిద్రపట్టడం లేదని వాపోయారు. ఈ నేపథ్యంలో ఇక ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవద్దంటూ కారు పార్కింగ్ సమీపంలో మూడు బోర్డులను ఏర్పాటు చేశారు. తమకు ఎదురవుతున్న ఇబ్బందులను అందులో పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

