world record | గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నించి.. కంటిచూపు పోగొట్టుకున్న కమెడియన్!
న్యూఢిల్లీ: గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించి చరిత్ర సృష్టించాలనుకున్న ఓ యువకుడి ప్రయత్నం బెడిసికొట్టింది. ఏడ్వడంలో వరల్డ్ రికార్డు నెలకొల్పాలన్న అతడి పట్టుదల చివరకు అతడికి కన్నీరునే మిగిల్చింది.
world record |న్యూఢిల్లీ: గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించి చరిత్ర సృష్టించాలనుకున్న ఓ యువకుడి ప్రయత్నం బెడిసికొట్టింది. ఏడ్వడంలో వరల్డ్ రికార్డు నెలకొల్పాలన్న అతడి పట్టుదల చివరకు అతడికి కన్నీరునే మిగిల్చింది. నైజీరియాకు చెందిన టెంబు అబెరె.. టిక్‌టాక్ కమెడియన్. అత్యంత ఎక్కువ సమయం ఏడ్చి ప్రపంచ రికార్డును బద్ధలు కొట్టాలని ప్రయత్నించాడు. ఏకంగా వారంపాటు ఆపకుండా ఏడ్చాడు. అయితే అతడి ప్రయత్నం వికటించింది. ఆపకుండా ఏడ్వడంతో అతడు పాక్షికంగా కంటిచూపును కోల్పోయాడు. కళ్లు, మొహం ఉబ్బిపోయాయి. రికార్డు కోసం అధికారికంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు దరఖాస్తు చేసుకోకపోవడంతో అతడి ప్రయత్నం వృథా అయింది.
నైజీరియాలో ఇటీవలి కాలంలో గిన్నిస్ రికార్డుల పిచ్చి ఎక్కువైంది. ఇటీవల ప్రముఖ చెఫ్ ఒకరు ఏకంగా 100 గంటల పాటు వంట చేసి పాపులర్ అయ్యారు. రికార్డుకు కొద్ది దూరంలో నిలిచిపోయినా, దేశ ఉపాధ్యక్షుడు, ఇతర సెలబ్రిటీల నుంచి ఆమెకు ప్రశంసలు లభించాయి. అనంతరం గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ నైజీరియన్లకు గిన్నిస్ సంస్థ సూచించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

