రాబోయే మహమ్మారి మరింత ప్రమాదకరం.. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ సృష్టికర్త వార్నింగ్

లండన్: ప్రస్తుతం ఉన్న కోవిడ్ సంక్షోభం కన్నా.. భవిష్యత్తులో రాబోయే మహమ్మారులు మరింత ప్రాణాంతకంగా ఉంటాయని ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ సృష్టికర్త ప్రొఫెసర్ డేమ్ సారా గిల్బర్ట్ వార్నింగ్ ఇచ్చారు. 44వ రిచర్డ్ డింబ్లేబీ లెక్చర్ సదస్సులో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. మహమ్మారులను ఎదుర్కొనేందుకు మరింత తీవ్ర స్థాయిలో ఫండింగ్ అవసరమన్నారు. ఇక ప్రస్తుతం కలవరపెడుతున్న ఒమ్రికాన్ వేరియంట్‌పై కూడా ఆమె స్పందించారు.
ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు.. ఒమిక్రాన్ వేరియంట్‌పై తక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ఒమిక్రాన్ గురించి పూర్తిగా తెలిసేవరకు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె అన్నారు. మన జీవితాలను వైరస్లు శాసించడం ఇదే చివరిసారి కాదు అని, వాస్తవం ఏమిటంటే, భవిష్యత్తులో రాబోయే వైరస్లు మరింత విధ్వంసకరంగా ఉంటాయన్నారు.
చాలా వేగంగా వ్యాపిస్తాయని, భారీగా ప్రాణ నష్టాన్ని మిగులుస్తాయని ఆమె హెచ్చరించారు. వైరస్‌లపై పోరాటంలో ఎంతో ప్రగతి సాధించామని, ఆ జ్ఞనాన్ని వదలుకోవద్దు అని ఆమె అన్నారు. ఒమిక్రాన్‌లో ఉన్న స్పైక్ ప్రోటీన్‌లో జరుగుతున్న మ్యుటేషన్ల వల్ల ఆ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు సారా తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

