భలే మంచి పొరుగు బేరం
తక్కువ ధరకే బియ్యం, చక్కెర, పప్పులు, పాలు వంటి నిత్యావసరాలు కావాలంటే మీరు ఏం చేస్తారు? ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే సూపర్ మార్కెట్ లేదా ఆన్లైన్ పోర్టల్‌ను వెదుకుతారు. తక్కువ ధరల్లో నిత్యావసరాలను కొనేందుకు న్యూజిలాండ్ ప్రజలు ఏకంగా పొరుగు దేశమైన ఆస్ట్రేలియాను ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే..
- న్యూజిలాండ్‌లో నిత్యావసరాల ధరలు పైపైకి
- ధరాఘాతాన్ని తప్పించుకోవడానికి వినూత్న యత్నాలు
- ఆస్ట్రేలియా నుంచి వస్తువులను కొంటున్న దేశ పౌరులు
- కమ్యూనిటీలుగా ఏర్పడి బల్క్‌గా వస్తువుల కొనుగోళ్లు
- ఎయిర్ఛార్జీలు పోయినా 35% ఆదా అవుతున్నట్టు వెల్లడి
తక్కువ ధరకే బియ్యం, చక్కెర, పప్పులు, పాలు వంటి నిత్యావసరాలు కావాలంటే మీరు ఏం చేస్తారు? ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే సూపర్ మార్కెట్ లేదా ఆన్లైన్ పోర్టల్‌ను వెదుకుతారు. తక్కువ ధరల్లో నిత్యావసరాలను కొనేందుకు న్యూజిలాండ్ ప్రజలు ఏకంగా పొరుగు దేశమైన ఆస్ట్రేలియాను ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే..
– నేషనల్ డెస్క్
పిండి, పండ్లు, బ్రెడ్డు, ఆల్మండ్స్, సబ్బులు, దుస్తుల కోసం న్యూజిలాండ్‌లోని ప్రజలు ఆస్ట్రేలియాలోని ప్రముఖ ఆన్లైన్ గ్రాసరీ పోర్టల్స్‌లోకి లాగిన్ అవుతున్నారు. తమకు అవసరమైన వస్తువులను తక్కువ ధరలకే కొనుగోలు చేసి.. డెలివరీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి కారణం న్యూజిలాండ్‌లో మండుతున్న ధరలే.
ద్రవ్యోల్బణం పైపైకి..
గడిచిన మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా న్యూజిలాండ్‌లో ద్రవ్యోల్బణం 6.9 శాతానికి ఎగబాకింది. దీంతో పండ్లు, కూరగాయలు, దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇలా అన్నింటి ధరలు 7 నుంచి 10 శాతం, పెట్రోల్, డీజిల్ ధరలు 18 శాతం పెరిగాయి. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగొచ్చని ఆర్థికమంత్రి గ్రాంట్ రాబర్ట్సన్ ఇటీవల పేర్కొన్నారు. దీంతో ధరాఘాతం నుంచి తప్పించుకోవడానికి అక్కడి పౌరులు పొరుగున ఉన్న ఆస్ట్రేలియా నుంచి నిత్యావసరాలతో పాటు వివిధ వస్తువులను ఆర్డర్ చేసుకొంటున్నారు.
అయినా తక్కువే..
న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి దూరం 2,225 కిలోమీటర్లు. అంత దూరం నుంచి వస్తువులను డెలివరీ చేయాలంటే ఛార్జీలు తడిసి మోపెడవుతాయి. అందుకే, న్యూజిలాండ్‌లోని వివిధ నగరాల్లోని ప్రజలు సోషల్‌మీడియాలో కమ్యూనిటీలుగా ఏర్పడుతున్నారు. తమకు అవసరమైన వస్తువులను బల్క్‌గా తెప్పించుకొంటున్నారు. దేశంలోని ధరలతో పోలిస్తే, ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకొంటున్న వస్తు ధరలు చాలా తక్కువగా ఉంటున్నాయని, జీఎస్టీ, కస్టమ్స్ ఫీజు, ఎయిర్‌లైన్స్ ఛార్జీలు కలిపినప్పటికీ దాదాపు 35% డబ్బు ఆదా అవుతున్నట్టు ఓ మహిళ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

