భీకర వానలతో న్యూయార్క్ అస్తవ్యస్తం..

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ అల్లకల్లోలమైంది. భీకర వానలు.. ఆకస్మిక వరదలు పోటెత్తడంతో.. నగరమంతా జలమయం అయ్యింది. దీంతో ఆ నగర మేయర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇదా తుఫాన్ వల్ల అమెరికాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే చరిత్రలో ఎన్నడూ లేనంతగా న్యూయార్క్‌లో వర్షం కురిసినట్లు మేయర్ బిల్ డీ బ్లాసియో తెలిపారు. రోడ్లపై అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నట్లు ఆయన వెల్లడించారు. అతి క్రూరంగా కురిసిన వాన వల్ల.. సబ్ స్టేషన్లు, ఇండ్లు, రోడ్లు అన్నీ నీటమునిగాయి. సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన ఫూటేజ్ వైరల్ అవుతోంది.
న్యూజెర్సీ అంతటా ఎమర్జెన్సీ ప్రకటించారు. వానల వల్ల ఒకరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. పాసైక్ వద్ద ఓ వ్యక్తి నీటిలో మునిగిపోయాడు. ముల్లికా హిల్ వద్ద ఓ టోర్నాడో సుమారు తొమ్మిది ఇండ్లను నేలమట్టం చేసింది. న్యూజెర్సీలోని కేర్నీలో పోస్టల్ ఆఫీసు బిల్డింగ్ కూలిపోయింది. ఆ సమయంలో దాంట్లో తొమ్మిది మంది ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలిగిస్తున్నారు.
న్యూయార్క్‌లో ఉన్న సెంట్రల్ పార్క్‌లో ఒక గంటలోనే 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వెదర్ సర్వీస్ పేర్కొన్నది. నగర ప్రజలు ఎవరూ రోడ్లమీదకు రావద్దు అంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అగ్నిమాపక సిబ్బంది కూడా బిజీగా ఉంది. న్యూయార్క్‌లో సబ్వే సర్వీసులను పూర్తిగా మూసివేశారు. న్యూయార్క్, న్యూజెర్సీ నుంచి వెళ్లే రైలు, విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pregnancy | 30 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా..?
Bulgaria Accident | పొగమంచు ఎఫెక్ట్.. ఒకదానినొకటి ఢీకొన్న 86 వాహనాలు.. 12 మంది మృతి
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
AP News | తీసుకున్న రూ.500 తిరిగివ్వలేదని ఓ వ్యక్తిపై వేడి నూనె గుప్పిన మహిళ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

