న్యూయార్క్‌లో స్కూళ్లకు దీపావళి సెలవు
న్యూయార్క్ సిటీ చరిత్రలో మొదటిసారి దీపావళి నాడు అక్కడి స్కూల్స్ అన్నీ సెలవు ప్రకటించాయి. హిందువుల ముఖ్య పండుగ ‘దీపావళి’ పురస్కరించుకొని నవంబర్ 1న నగరంలోని స్కూళ్లన్నింటికీ సెలవు ఇచ్చినట్టు న్యూయార్క్ సిటీ డిప్యూటీ కమిషనర్ దిలీప్ చౌహాన్ వెల్లడించారు.
- న్యూయార్క్ సిటీ చరిత్రలో మొదటిసారి
న్యూయార్క్, అక్టోబర్ 30: న్యూయార్క్ సిటీ చరిత్రలో మొదటిసారి దీపావళి నాడు అక్కడి స్కూల్స్ అన్నీ సెలవు ప్రకటించాయి. హిందువుల ముఖ్య పండుగ ‘దీపావళి’ పురస్కరించుకొని నవంబర్ 1న నగరంలోని స్కూళ్లన్నింటికీ సెలవు ఇచ్చినట్టు న్యూయార్క్ సిటీ డిప్యూటీ కమిషనర్ దిలీప్ చౌహాన్ వెల్లడించారు. ఈ ఏడాది జూన్‌లో మేయర్ కార్యాలయం దీపావళి రోజును పబ్లిక్ హాలిడేగా అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఇది స్కూళ్లకు కూడా వర్తింపజేసింది. ‘న్యూయార్క్ నగరంలో సుమారుగా 11 లక్షల మంది విద్యార్థులున్నారు.
స్కూల్‌కు వెళ్లాలా? గుడికి వెళ్లాలా? అన్న టెన్షన్ వాళ్లకు ఈ ఏడాది లేదు. దీపావళి వేడుకను సంతోషంగా గడుపుకునేందుకు సెలవు ప్రకటించాం. ప్రవాస భారతీయులు, వారి సంఘాల నాయకులు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు ఎన్నో ఏండ్లుగా చేస్తున్న డిమాండ్‌ను సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ నెరవేర్చారు’ అని దిలీప్ చౌహాన్ చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

