ఒట్టావా: శరీరంలో వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్లను మట్టుబెట్టాల్సిన రోగనిరోధక వ్యవస్థ ఎర్రరక్తకణాలనే చంపేస్తే! ఈ అరుదైన వ్యాధిని ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటారు. అంటే.. శ్వేతరక్తకణాలు అతిగా స్పందించాయన్న మాట. కెనడాకు చెందిన ఓపన్నెండేండ్ల బాలుడికి ఇదే వ్యాధి సోకింది. కొన్ని రోజులుగా పిల్లాడు పొత్తి కడుపు నొప్పి, ఎర్రగా మూత్రం, గొంతునొప్పితో బాధపడుతున్నాడు. ఈ లక్షణాలను చూసి పచ్చకామెర్లు అని డాక్టర్లు చికిత్స చేపట్టారు. కానీ, రోజురోజుకు ఆ బాలుడి నాలుక పసుపుపచ్చగా మారటంతో పరీక్షలు నిర్వహించారు. అందులో రోగనిరోధక వ్యవస్థ ఎర్రరక్తకణాలను చంపేస్తున్నట్టు గుర్తించారు. శీతల వాతావరణం వల్ల పిల్లలకు ఈజబ్బు వస్తుందని, కోల్డ్ అగ్లుటినిన్ అనే ఆటోఇమ్యూన్డిజార్డర్ బాలుడికి ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఏడు వారాల పాటు స్టెరాయిడ్స్ ఎక్కించటంతో బాలుడు వ్యాధి నుంచి కోలుకుంటున్నాడని పేర్కొన్నారు.