చైనా గబ్బిలాల్లో కొత్త కరోనా

బీజింగ్, జూన్ 13: గబ్బిలాల్లో కొత్త కరోనా వైరస్‌లను గుర్తించినట్టు చైనా పరిశోధకులు ప్రకటించారు. ‘రినోలోఫస్ పుసిల్లుస్’ అనే వైరస్ ఇందులో ఒకటని, ప్రస్తుత కొవిడ్-19 వైరస్‌కు ఇది జన్యుపరంగా దగ్గరగా ఉన్నవాటిల్లో రెండోదని తెలిపారు. షాండోంగ్ వర్సిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయన వివరాలను ‘సెల్’ జర్నల్‌లో ప్రచురించారు. 2019 మే నుంచి 2020 నవంబర్ మధ్య కాలంలో చైనాలోని యునాన్ అనే ప్రాంతంలో గబ్బిలాల నుంచి నమూనాలను సేకరించారు. వీటిలో సార్స్-కొవ్-2 తరహా కరోనా వైరస్లు నాలుగు ఉన్నట్టు గుర్తించామన్నారు. రినోలోఫస్ పుసిల్లుస్ స్పైక్ ప్రొటీన్‌లో జన్యుపరమైన తేడాలు మినహా, మిగతా అన్నింట్లో సార్స్-కొవ్-2కు ఈ వైరస్ దగ్గరగా ఉన్నట్టు వెల్లడించారు. 2020 జూన్‌లో థాయ్‌లాండ్ నుంచి సేకరించిన సార్స్-కొవ్-2 సంబంధిత వైరస్‌ను, ప్రస్తుత ఫలితాలను విశ్లేషించగా కొవిడ్-19 వైరస్‌కు సన్నిహిత సారూప్యతగల వైరస్లు గబ్బిలాల్లో కొనసాగుతున్నట్టు వెల్లడైందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- China Bats
- Covid-19
- New corona
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

