చైనాలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం.. వారం రోజుల్లోనే 13 వేల మంది మృతి
Covid-19 | కరోనా వైరస్‌కు పుట్టినిల్లయిన చైనాలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. అక్కడ కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. ప్రతిరోజూ లక్షల్లో జనం కరోనా బారినపడుతున్నారు. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.
బీజింగ్: కరోనా వైరస్‌కు పుట్టినిల్లయిన చైనాలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. అక్కడ కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. ప్రతిరోజూ లక్షల్లో జనం కరోనా బారినపడుతున్నారు. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 13 నుంచి 19 వరకు కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఆ దేశంలో మొత్తం 13 వేల మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
కరోనా మహమ్మారి బారినపడి గడిచిన వారంలో 13 వేల మంది మరణించారని, వారిలో 681 మంది శ్వాసవ్యవస్థ వైఫల్యంవల్ల, 11,987 మంది కరోనాతోపాటు ఇతర ఇన్ఫెక్షన్లు సోకడంవల్ల ప్రాణాలు కోల్పోయారని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తన అధికారిక ప్రకటనలో పేర్కొన్నది. కానీ కేవలం కరోనా కారణంగా 13 వేల మంది మృతిచెందారని మాత్రం చెప్పలేదు.
అంతకుముందు వారం చేసిన ప్రకటనలో దేశంలో జీరో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేసింది మొదలు జనవరి 12 వరకు 60 వేల కరోనా మరణాలు సంభవించాయని సీడీసీ తెలిపింది. కానీ, చైనా అధికారిక లెక్కలు తప్పుల తడకలని కరోనా కేసులు, మరణాల లెక్కలుకట్టే ఓ స్వతంత్ర సంస్థ చెబుతోంది. గత డిసెంబర్లో జీరో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి ఇప్పటివరకు చైనాలో దాదాపు 6 లక్షల కరోనా మరణాలు సంభవించాయని స్పష్టంచేస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

