చైనాకు వార్నింగ్ ఇచ్చిన నాటో.. ఎందుకు?

బ్రస్సెల్స్: అనైతిక రీతిలో చైనా తన సైనిక విస్తరణ కొనసాగిస్తున్నదని, ఆ దేశ సైన్యం నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో డ్రాగన్ దేశానికి నాటో నేతలు వార్నింగ్ ఇచ్చారు. చైనా ప్రవర్తన వ్యూహాత్మక సవాల్‌గా మారినట్లు వారు పేర్కొన్నారు. బ్రస్సెల్స్‌లో జరిగిన నాటో(నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) భేటీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. అత్యంత వేగంగా చైనా తన అణ్వాయుధ శక్తిని పెంచుకుంటోందని నాటో నేతలు ఆరోపించారు. రష్యాతో సైనిక అంశాల్లో డ్రాగన్ దేశం సహకరిస్తున్నట్లు ఆరోపించారు. సైనిక సత్తాలో.. సాంకేతిక అంశాల్లో నాటోకు సమానంగా చైనా నిలుస్తున్నట్లు నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ తెలిపారు. కానీ కమ్యూనిస్టు దేశంతో ప్రచ్ఛన్న యుద్ధానికి వెళ్లడం లేదని ఆయన అన్నారు. నాటో దళం అత్యంత శక్తివంతమైంది. దాంట్లో 30 యురోపియన్ దేశాలతో పాటు ఉత్తర అమెరికా దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కమ్యూనిస్టు రాజ్యాల విస్తరణను అడ్డుకునేందుకు నాటో దళాన్ని ఏర్పాటు చేశారు. 72 ఏళ్ల నాటో కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ఇటీవల బైడెన్ స్పష్టం చేశారు. చైనా పారదర్శకంగా వ్యవహరించడం లేదని, ఎటువంటి డేటాను ఇవ్వడం లేదని నాటో చీఫ్ ఆరోపించారు. చైనా తమకు శత్రువు కాదు అని, కానీ ఆ దేశం వ్యవహరిస్తున్న తీరు తమ రక్షణకు సవాల్‌గా మారిందని అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

