వాషింగ్టన్, అక్టోబర్ 28: సూర్యుడిని ఎప్పుడు చూసినా నిప్పులు కక్కుతూ ఉగ్ర రూపంతో కనిపిస్తాడు. అలాంటిది నవ్వటం ఎప్పుడైనా చూశారా? ఇదుగోండి.. ఇలా నవ్వుతున్నాడు అంటూ నాసా ఒక ఫొటోను విడుదల చేసింది. సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ ప్రతి పది నిమిషాలకోసారి సూర్యుడిని ఫొటోలు తీస్తుంది. ఒక ఫొటోలో సూర్యుడి ఉపరితలంపై కరోనల్ హోల్స్ నవ్వినట్టు కనిపించాయి.