NASA | వాషింగ్టన్, సెప్టెంబర్ 13: విశాలమైన విశ్వంలో భూమి వంటి మరో గ్రహం ఉందనేందుకు ఆధారాలు లభ్యమయ్యాయని ‘నాసా’ సంచలన ప్రకటన చేసింది. నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా వెలువడిన తాజా సమాచారం ప్రకారం, భూమితో పోల్చితే 8.6 రెట్లు పరిమాణం కలిగిన కే2-18బీ అనే గ్రహంపై జీవం ఉండొచ్చు.
ఆ గ్రహ వాతావరణాన్ని పరిశీలించగా..అక్కడ సముద్రాలు, హైడ్రోజన్ ఉండేందుకు అవకాశమున్నది. భూమి నుంచి 120 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహ వాతావరణంలో కార్బన్, మిథేన్, కార్బన్డయాక్సైడ్ ఉన్నట్టు నాసా తెలిపింది.