Asteroid Bennu | వాషింగ్టన్ డీసీ, అక్టోబర్ 4: అంతరిక్షంలో ప్రతి ఆరేండ్లకోమారు భూమికి అత్యంత సమీపంగా వచ్చే ఆస్టరాయిడ్ ‘బెన్ను’, 2182లో భూమిని ఢీకొనే ప్రమాదముందని నాసా సైంటిస్టులు అంచనావేశారు. 1610 అడుగుల పొడవున్న ‘బెన్ను’ ఒకవేళ భూమిని ఢీకొంటే, అప్పుడు వెలువడే శక్తి 24 అణుబాంబు పేలుళ్లకు సమానమని, 22 మెగాటన్నుల శక్తి విడుదలవుతుందని నాసా వివరించింది.
‘2182, సెప్టెంబర్ 24న భూమికి అత్యంత సమీపంగా వెళ్లే సమయంలో ఇది జరిగేందుకు 0.037శాతం అవకాశముంది. అదుపు తప్పి భూకక్షలోకి వచ్చాక, భూగురుత్వాకర్షణకు లోనయ్యే ప్రమాదముంది. 1999, 2005, 2011లో భూమికి 46.5 లక్షల మైళ్ల దూరం నుంచి వెళ్లింది’ అని నాసా తెలిపింది. ఆస్టరాయిడ్ బెన్నును నాసా 1999లో కనుగొన్నది.