ఫైర్‌బ్రాండ్ బౌద్ధ గురువు విరాతును రిలీజ్ చేసిన మయన్మార్ మిలిటరీ

నెపితా: బౌద్ద గురువు అసిన్ విరాతును మయన్మార్ మిలిటరీ రిలీజ్ చేసింది. జాతీయోద్యమ, ముస్లిం వ్యతిరేక ప్రసంగాలు చేయడంలో విరాతు దిట్ట. గత ప్రభుత్వం విరాతుపై దేశద్రోహం కేసులు నమోదు చేసింది. అయితే ఫిబ్రవరిలో సైనిక పాలన వచ్చిన తర్వాత విరాతుపై కేసులను ఎత్తివేశారు. మిలిటరీకి అనుకూలంగా అభిప్రాయాలను విరాతు వ్యక్తపరిచారు. బౌద్ద బిన్ లాడెన్ అంటూ ఆయన్ను పిలుస్తారు. ముస్లింలను టార్గెట్ చేస్తూ అతను చేసే ప్రసంగాలు చాలా పదునుగా ఉంటాయి. ముఖ్యంగా రోహింగాలను తన ప్రసంగాలతో టార్గెట్ చేసేవారు. ఇటీవల జుంటా మిలిటరీ తరపున ప్రచారం చేశారు. ఆంగ్ సాన్ సూకీ, నేషనల్ లీగ్ పార్టీలను తన ప్రసంగాల్లో విమర్శించేవారు.
అయితే 2019లో విద్వేష ప్రసంగం చేస్తున్నట్లు అతనిపై కేసు బుక్ చేశారు. ఆ సమయంలో విరాతు పరారీ అయ్యారు. గత ఏడాది నవంబర్‌లో మళ్లీ అధికారులకు లొంగిపోయాడు. విరాతుపై ఉన్న అన్ని కేసులను కొట్టివేస్తున్నట్లు మిలిటరీ ప్రభుత్వం సోమవారం పేర్కొన్నది. ప్రస్తుతం అతను ఆర్మీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మయన్మార్‌లో రోహింగ్యాలకు వ్యతిరేకంగా హింస చేపట్టిన కేసుల్లో విరాతు కీలక నిందితుడు. బౌద్ద జాతీయోద్యమం సాగించాడు. బౌద్దులకు చెందిన షాపులను, ఆస్తులను కేవలం వారికే అమ్మాలని, బౌద్దులు ఆ మతస్తులనే చేసుకోవాలని పిలుపునిచ్చారు. 2012లో రాఖైన్ ప్రావిన్సులో జరిగిన హింసతో విరాతు వెలుగులోకి వచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

