కీవ్: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా వాగ్నర్ ప్రైవేటు దళం ఇటీవల సైనిక తిరుగుబాటుకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ దళానికి చెందిన అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ ప్రస్తుతం రష్యాలో ఉన్నట్లు బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో(President Lukashenko) ప్రకటించారు. సైనిక తిరుగుబాటు చేపట్టిన రెండుమూడు రోజుల్లోనే ప్రిగోజిన్ వెనక్కి తగ్గారు. అయితే అప్పటి నుంచి ఆయన ఎక్కడికి వెళ్లారో మిస్ట్రీగా మిగిలిపోయింది. దేశద్రోహం కేసులు ఎత్తివేయనున్నట్లు రష్యా ప్రకటించడంతో ప్రిగోజిన్ బెలారస్‌కు వెళ్లినట్లు భావించారు. కానీ గురువారం బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఓ ప్రకటన చేశారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోనే ప్రిగోజిన్ ఉన్నట్లు లుకషెంకో తెలిపారు. అయితే ప్రిగోజిన్ గురించి తామేమీ ఆలోచించడం లేదని రష్యా అధ్యక్ష భవనం క్రిమ్లిన్ పేర్కొన్నది.