వాషింగ్టన్ : మ్యూజిక్ ఐకాన్ ఎల్టన్ జాన్(74) కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎల్టన్ జాన్ మంగళవారం ప్రకటించారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో టెక్సాస్‌లో నిర్వహించాల్సిన రెండు ప్రోగ్రామ్స్‌ను వాయిదా వేసుకుంటున్నట్టు జాన్ వెల్లడించారు.
డల్లాస్‌లో నిర్వహించాల్సిన షో వివరాలను త్వరలోనే రీషెడ్యూల్ చేస్తానని తెలిపారు. ప్రస్తుతమున్న టికెట్లే ఆ షోకు వర్తిస్తాయని, త్వరలోనే మీ ముందుకు వస్తానని ప్రకటించారు. షో వాయిదా పడడం వల్ల ఇబ్బందికి గురైన వారిని క్షమాపణ కోరుతున్నానని తెలిపారు. తనతో పాటు తన బృందం సురక్షితంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్టన్ జాన్ స్పష్టం చేశారు.