న్యూయార్క్: ఫేస్బుక్ సరికొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఒకే అకౌంట్లో మల్టీపుల్ ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొస్తున్నట్టు మెటా తాజాగా వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించి ఫేస్బుక్లో అవసరమైన వారు మల్టీపుల్ ప్రొఫైళ్లను ఒకే అకౌంట్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. వ్యక్తిగత, వ్యాపార సంబంధిత ప్రొఫైళ్ల మధ్య అవసరమైనప్పుడు మార్పిడి చేసుకొని వినియోగించుకోవచ్చు.