మ్యూజిక్ వీడియో షూట్ చేస్తుండగా కాల్పుల కలకలం
ర్యాపర్ ఫ్రెంచ్ మోంటాన్ మ్యూజిక్ వీడియో షూటింగ్ జరుగుతుండగా కాల్పుల మోత కలకలం రేపింది. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ మియామి గార్డెన్స్‌లో రెస్టారెంట్ వద్ద దుండగులు గురువారం పలువురిపై కాల్పులు జరిపారు.
న్యూయార్క్ : ర్యాపర్ ఫ్రెంచ్ మోంటాన్ మ్యూజిక్ వీడియో షూటింగ్ జరుగుతుండగా కాల్పుల మోత కలకలం రేపింది. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ మియామి గార్డెన్స్‌లో రెస్టారెంట్ వద్ద దుండగులు గురువారం పలువురిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ర్యాపర్ ఫ్రెంచ్ మోంటానా మ్యూజిక్ వీడియో చిత్రీకరణ జరుగుతోంది.
లికింగ్ రెస్టారెంట్ పార్కింగ్ ప్రదేశంలో షూటింగ్ జరుగుతుండగా అక్కడకు సమీపంలో కొందరి మధ్య వాగ్వాదం జరిగిందని, ఆపై పది నుంచి 15 గన్‌షాట్స్ వినిపించాయని మియామి గార్డెన్స్ పోలీసులు తెలిపారు. కాల్పుల కలకలంతో ప్రజలు తలోదిక్కు పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో పదిమందికి గాయాలయ్యాయని స్ధానిక వార్తా చానెల్స్ వెల్లడించాయి.
ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కాల్పుల ఘటనతో సమీపంలోని రెస్టారెంట్లు, వాణిజ్య సంస్ధలను మూసివేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని, ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

