Solar Storm: శక్తివంతమైన సౌర తుఫాన్ రిలీజ్.. ప్రమాదంలో పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ
Solar Storm: శక్తివంతమైన సౌర తుఫాన్ శుక్రవారం భూమిని తాకింది. దీంతో ఆకాశంలో అద్భుత దృశ్యాలు కనువిందు చేశాయి. టాస్మానియా నుంచి బ్రిటన్ వరకు .. వినీలాకాశం వింత వింత రంగుల్లో శోభించింది. ఆ శక్తివంతమైన సౌర తుఫాన్ ధాటికి శాటిలైట్లు, పవర్ గ్రిడ్లకు సమస్యలు తలెత్తనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వాషింగ్టన్: గడిచిన రెండు దశాబ్ధాల్లో లేనటువంటి శక్తివంతమైన సౌర తుఫాన్( Solar Storm) శుక్రవారం భూమిని తాకింది. దీంతో ఆకాశంలో అద్భుత దృశ్యాలు కనువిందు చేశాయి. టాస్మానియా నుంచి బ్రిటన్ వరకు .. వినీలాకాశం వింత వింత రంగుల్లో శోభించింది. ఆ శక్తివంతమైన సౌర తుఫాన్ ధాటికి శాటిలైట్లు, పవర్ గ్రిడ్లకు సమస్యలు తలెత్తనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనాల్ మాస్ ఎజెక్సన్స్(సీఎంఈఎస్) సూర్యుడి నుంచి వెలుబడ్డనట్లు నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ అంచనా వేసింది. అయితే సౌర తుఫాన్ చాలా తీవ్రంగా ఉందని, ఎక్స్ట్రీమ్ జియోమాగ్నిక్ స్టార్మ్ అని ఆ తుఫాన్‌ను అప్‌గ్రేడ్ చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని సీఎంఈలు భూమిని తాకే అవకాశాలు ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చారు.
సోలార్ స్టార్మ్ వల్ల ఆకాశంలో అరోరాలు ఏర్పడ్డాయి. ఉత్తర యూరోప్ నుంచి ఆస్ట్రేలేసియా వరకు ఆకాశం రంగు రంగుల్లో దర్శనం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. నార్త్నర్ లైట్స్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఆ లైట్స్ కంటికి నేరుగా కనిపించినట్లు బ్రిటన్‌లో స్థానికులు చెప్పారు. టాస్మానియాలో మాత్రం తెల్లవారుజామున నాలుగు గంటలకే ఆకాశం కలర్ఫుల్గా దర్శనం ఇచ్చింది. సౌర తుఫాన్ వల్ల అయస్కాంత క్షేత్రంలో మార్పులు సంభవించే అవకాశాలు ఉంటాయని, అందుకే శాటిలైట్ ఆపరేటర్లు, ఎయిర్‌లైన్స్, పవర్ గ్రిడ్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
సాధారణంగా వచ్చే సోలార్ ఫ్లేర్స్ కన్నా ప్రస్తుతం సీఎంఈలు అతి వేగంగా భూమిని చేరుకుంటాయి. అవి దాదాపు సెకనుకు 500 మైళ్లతో ప్రయాణిస్తాయి. భూమి కన్నా 17 రేట్లు పెద్దగా ఉన్న సన్‌స్పాట్ నుంచి బలమైన సీఎంఈలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే సూర్యుడు 11ఏళ్ల సైకిల్‌కు చేరువవుతున్న నేపథ్యంలో ఈ సోలార్ స్టార్మ్స్ వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

