మంకీపాక్స్ వ్యాప్తిపై ఆందోళన… ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా WHO ప్రకటన
వాషింగ్టన్: మంకీపాక్స్ క్రమంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్నది. ఇప్పటి వరకు 75 దేశాల్లో 16 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరింతగా ఆందోళన చెందుతోంది. మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా శనివారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో మంకీపాక్స్ ప్రమాదం మధ్యస్థంగా ఉందని WHO చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. అయితే యూరోపియన్ ప్రాంతంలో మాత్రం ప్రమాదం ఎక్కువగా ఉందని అంచనా వేశారు. కొత్త విధానాల్లో ప్రపంచ వ్యాప్తంగా మరింతగా విస్తరించే ముప్పు ఉందన్నారు. ఈ నేపథ్యంలో మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, మంకీపాక్స్ వైరస్‌పై పోరాటానికి ప్రపంచ దేశాల మధ్య సమన్వయం అవరసమని టెడ్రోస్ స్పష్టం చేశారు. మశూచి టీకాలు కొంత రక్షణ కలిగిస్తాయని తెలిపారు. అయితే ఈ వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు కొత్త టీకాలు అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. మరోవైపు బవేరియన్ నార్డిక్ తయారు చేసిన మశూచి వ్యాక్సిన్ ‘ఇమ్వానెక్స్’ను మంకీపాక్స్‌పై పోరాటానికి యూరోపియన్ యూనియన్ డ్రగ్ రెగ్యులేటర్ శుక్రవారం సిఫార్సు చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

