School Form | పిల్లాడి గురించి ప్రశ్నలు అడిగిన స్కూల్.. ఆ తల్లి సమాధానాలకు నవ్వకుండా ఉండలేరు
School Form | ప్రస్తుతం స్కూల్ విద్య పిల్లల కన్నా తల్లిదండ్రులకే తలనొప్పిగా మారింది. పిల్లలకు సంబంధించి కొన్ని స్కూల్స్‌లో ఉండే నిబంధనలు, విధివిధానాలు అర్థం చేసుకోవడానికే చాలా టైం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ప్రస్తుతం స్కూల్ విద్య పిల్లల కన్నా తల్లిదండ్రులకే తలనొప్పిగా మారింది. పిల్లలకు సంబంధించి కొన్ని స్కూల్స్‌లో ఉండే నిబంధనలు, విధివిధానాలు అర్థం చేసుకోవడానికే చాలా టైం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తాజాగా ఒక తల్లికి తన పిల్లాడు చదువుకునే స్కూల్ నుంచి ఒక సర్వే వచ్చింది. దీనిలో కొన్ని ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. వీటిని చూసిన నెటిజన్లు ఆమె నిజాయితీకి, హాస్య చతురతకు నవ్వుకుంటున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే? అమెరికాలో న్యూయార్క్ మ్యాగజైన్లో ఫీచర్స్ రైటర్‌గా పని చేసే ఎమిలీ గోల్డ్.. తన నాలుగేళ్ల బాబు ఇల్యాను ఒక స్కూల్లో చదివిస్తోంది. స్వతహాగా నవలలు కూడా రాసే అలవాటున్న ఎమిలీకి హాస్య చతురత ఎక్కువే. ఈ క్రమంలోనే స్కూల్ నుంచి తన బిడ్డ తీసుకొచ్చిన ఒక ఫామ్ ఫిల్ చేయడానికి కూర్చుంది. దానిలో ప్రశ్నలు చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అందుకే వాటికి తగినట్లు ఫన్నీ సమాధానాలు రాసింది.
వాటిలో ‘విద్యలో ఈ ఏడాది మీ పిల్లాడు ఏ విషయంపై ఎక్కువ కష్టపడాలని భావిస్తున్నారు?’ అని ప్రశ్న ఉంది. దానికి ఎమిలీ.. ‘అదెవరికి కావాలి? వాడికి జస్ట్ నాలుగేళ్లే’ అని బదులిచ్చింది. ‘మీ బిడ్డ గురించి ఇంకా ఏమైనా చెప్పదలచుకున్నారా?’ అన్న ప్రశ్నకు ఎమిలీ ఇచ్చిన సమాధానం మరింత నవ్వు తెప్పిస్తుంది. ‘ఇల్యాను మీరు కూడా ప్రేమిస్తారు. వాడు ఎంత మంచి, ముద్దులొలికే పిల్లాడంటే.. ఒక్కోసారి నాకే వీడు నిజంగా నా కొడుకేనా? లేదంటే పుట్టగానే ఎవరైనా మార్చేశారా? అని డౌట్ వస్తుంది. (అప్పుడే, నా డెలివరీ ఇంట్లోనే జరిగిన విషయం గుర్తొస్తుంది)’ అని ఎమిలీ రాసింది. ఈ సమాధానాలు చదివిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఇకపై తాము కూడా ఆమె సమాధానాలను కాపీ కొట్టేస్తామని అంటున్నారు.
https://twitter.com/EmilyGould/status/1569739531498266625
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- child
- Mom
- School Form
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

