ఢాకా, ఫిబ్రవరి 14: బంగ్లాదేశ్ కొత్త అధ్యక్షుడిగా మహమ్మద్ షహాబుద్దీన్ చుప్పూ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ దేశ ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. అవామీ లీగ్ పార్టీ తరఫున చుప్పూ పోటీ చేశారని, ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నామని తెలిపింది. 74 ఏండ్ల వయసున్న చుప్పూ ప్రస్తుతం అవామీ లీగ్ పార్టీ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేస్తున్నారు.