కేంబ్రిడ్జి, నవంబర్ 25: ఇప్పుడంతా రోబోల కాలం నడుస్తున్నది. సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో శాస్త్రవేత్తలు అన్ని పనులనూ చక్కబెట్టేలా రోబోలను తయారుచేస్తున్నారు. తనకు తానుగా పెద్దగా మారే సరికొత్త రోబోను అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఈ రోబో తనకు తాను పెద్దగా నిర్మించుకోవడంతోపాటు దేన్నైనా చకచకా నిర్మించేస్తుంది.
పెద్ద బిల్డింగులు, వాహనాల నిర్మాణంలో సహాయపడుతుంది. ఈ రోబో తయారీ ఎంఐటీలోని బిట్స్ అండ్ ఆటమ్స్ (సీబీఏ) నేతృత్వంలో సాగింది. దీన్ని ఇటీవల పరీక్షించారు. చిన్నచిన్న ఒకేలాంటి తేలికపాటి బ్లాక్స్‌తో ఈ రోబో రేసింగ్ కార్లు, విమానం రెక్కలను విజయవంతంగా నిర్మించింది.