రష్యా మిస్సైళ్ల దాడిలో ఏడుగురు మృతి
న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతున్నది. సోమవారం పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఎల్వివ్ నగరంలో పలు మిస్సైళ్లతో జరిపిన దాడుల్లో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మరో వైపు అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ వ్యూహాత్మకంగా ముఖ్యమైన మారియుపోల్ నగరంలో చివరి వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఓడరేవుల నగరంగా ప్రసిద్ధి చెందిన నగరంలో భారీ స్టీల్ ప్లాంట్లను రష్యన్ సైన్యం ధ్వంసం చేసింది.
సోమవారం జరిపిన రష్యా జరిపిన మిస్సైల్ దాడుల్లో ఏడుగురు మరణించారని, ఒక చిన్నారి సహా ఎనిమిది గాయపడ్డారని ఎల్వివ్ గవర్నర్ మక్సిమ్ కోజిటిస్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ తూర్పు పారిశ్రామిక ప్రాంతం డాన్‌బాస్‌లోని ఆయుధ కర్మాగారాలు, రైల్వేలు, ఇతర మౌలిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తున్నది. మరో వైపు రష్యాకు లొంగిపోయేది లేదని ఇప్పటికే జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఉక్రేనియన్ నగరాలపై దాడిని కొనసాగించేందుకు రష్యా దళాలకు సహాయం చేయడానికి సిరియన్ సైన్యం యుద్ధంలో పాల్గొనాలని యోచిస్తున్నారు.
అంతకు ముందు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2017 సిరియా పర్యటన సందర్భంగా అక్కడి జనరల్‌ను ప్రశంసించారు. ఈ క్రమంలో బ్రిగేడియర్ జనరల్ సుహైల్ అల్ హసన్ ఆధ్వర్యంలో సిరియా దళాలు రష్యా తరఫున ఉక్రెయిన్‌లో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో వైపు మరియూపోల్‌లో పరిస్థితి దారుణంగా ఉందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రి కులేబా పేర్కొన్నారు. నగరంలో ఉక్రేనియన్ ఆర్మీ సిబ్బంది, పౌరులను రష్యన్ దళాలు చుట్టుముట్టాయన్నారు. ఉక్రెయిన్ పోరాటం కొనసాగుతుందని, కానీ భారీ విధ్వంసం కారణంగా ఇప్పుడు నగరం ఉనికిలో లేదని పేర్కొన్నారు.
మరో వైపు రష్యా దూకుడుతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) అదనంగా 50 మిలియన్ యూరోల మానవతా నిధులను ఉక్రెయిన్‌కు కేటాయిస్తున్నట్లు యూరోపియన్ కమిషన్ ప్రకటించింది. ఇందులో ఉక్రెయిన్‌లోని మానవతా ప్రాజెక్టుల కోసం 45 మిలియన్లు, మోల్డోవా కోసం 5 మిలియన్ల యూరోల సాయం అందిస్తున్నట్లు తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

