మీరు 1981-1996 మధ్యలో జన్మించారా? కచ్చితంగా మీకు ఈ అలవాటు ఉంటుందట!
మీరు ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నారా? అబద్ధాలు చెబుతూ సోషల్ మీడియాలో ఇతరుల్ని మెప్పిస్తున్నారా? పని ప్రదేశాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి బాస్‌కు అవే అబద్ధాలు చెబుతున్నారా?
న్యూయార్క్, జూలై 8: మీరు ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నారా? అబద్ధాలు చెబుతూ సోషల్ మీడియాలో ఇతరుల్ని మెప్పిస్తున్నారా? పని ప్రదేశాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి బాస్‌కు అవే అబద్ధాలు చెబుతున్నారా? అయితే మీరు 1981-1996 మధ్య జన్మించారేమో చూసుకోండి! మిలీనియల్స్‌గా పిలిచే ఈ ఏజ్ గ్రూప్ వారు అందరి కంటే ఎక్కువగా అబద్ధాలు చెబుతారని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. అమెరికాకు చెందిన ప్లేస్టార్ సంస్థ దీనిపై సర్వే చేసింది. కొలరాడో, ఇల్లీనాస్, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సీల్వేనియా, టెన్నెసీ, విస్కాన్సిన్ తదితర రాష్ర్టాల్లోని 1306 మందిని ఈ సంస్థ సర్వే చేసింది. ఎక్కువగా అబద్ధాలు చెప్పే ఈ ఏజ్ గ్రూప్‌కు చెందిన వారు ఈ సర్వేలో నిజాలను వెల్లడించారు. ఈ సర్వేకు సంబంధించిన వివరాలతో న్యూయార్క్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది.
రోజుకు కనీసం ఒక్క అబద్ధమైనా చెబుతామని 13 శాతం మంది మిలీనియల్స్ అంగీకరించారు. తమ రెజ్యూమ్‌లను ఫాబ్రికేట్ చేశామని మూడింట ఒక వంతు మంది ఒప్పుకొన్నారు. ప్రతి ఐదుగురు మిలీనియల్స్‌లో ఇద్దరు పని ప్రదేశాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తప్పించుకొనేందుకు బాస్‌కు అబద్ధాలు చెబుతున్నట్టు సర్వేలో తేలింది. సోషల్ మీడియాలో ఇతరుల్ని మెప్పించేందుకు తాము అబద్ధాలు చెబుతున్నట్టు నాలుగింట ఒక వంతు మంది తెలిపారు. సోషల్ మీడియాలో మహిళలతో పోలిస్తే పురుషులు 10 శాతం ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నారని సర్వేలో తేలింది.
జెన్ జెడ్, జెన్ ఎక్స్‌ల మధ్య సారూప్యత…
ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు అబద్ధాలు చెబుతున్నట్టు 58 శాతం మంది తెలపగా, గోప్యత, ఇతరులు మందలించకుండా తప్పించుకునేందుకు చెబుతున్నట్టు 42 శాతం మంది పేర్కొన్నారు. అదే సమయంలో రోజుకు ఒక అబద్ధమైనా చెబుతామని 2 శాతం మంది బేబీ బూమర్స్ (1946-1964 మధ్య జన్మించినవారు) తెలిపారు. జెన్ జెడ్ (1997-2021), జెన్ ఎక్స్ (1965-1980)ల మధ్య సారూప్యత కనిపించింది. రోజూ అబద్ధం చెబుతామని ఈ గ్రూపులకు చెందిన 5 శాతం మంది మాత్రమే తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Liars
- Millennials
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

