Title 42: అమెరికా – మెక్సికో బార్డర్లో భారీగా శరణార్థులు.. అసలు టైటిల్ 42 ఏంటి.?
అమెరికాలో ఆశ్రయం కోరి వచ్చిన వారిపై టైటిల్ - 42 పేరుతో విధించిన ఆంక్షల గడువు ముగిసింది. దీంతో అమెరికా మెక్సికో సరిహద్దుకు శరణార్ధులు బారులు తీరుతున్నారు.
Title 42: అమెరికాలో ఆశ్రయం కోరి వచ్చిన వారిపై టైటిల్ – 42 పేరుతో విధించిన ఆంక్షల గడువు ముగిసింది. దీంతో అమెరికా మెక్సికో సరిహద్దుకు శరణార్ధులు బారులు తీరుతున్నారు. టైటిల్ – 42 స్థానంలో బైడెన్ సర్కారు కొత్త విధానం తీసుకువచ్చింది. అసలు ఈ టైటిల్ 42 ఏంటి అనేది చూద్దాం..
కరోనా సమయంలో ట్రంప్ సర్కారు టైటిల్ – 42 తీసుకొచ్చింది. ఈ విధానం ప్రకారం.. అమెరికా – మెక్సికో బార్డర్కు వచ్చే వలసదారులు శరణు కోరడాన్ని తిరస్కరించవచ్చు. ఈ టైటిల్ – 42 వచ్చినప్పటి నుంచి దాదాపు 28 లక్షల మందికి ఆశ్రయం ఇచ్చేందుకు నిరాకరించినట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే చట్టపరమైన చర్యలు మాత్రం ట్రంప్ సర్కారు తీసుకోలేదు. మే 11న దీని గడువు ముగియడంతో బైడెన్ ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
కొత్త నిబంధనలు ఏంటి?
కొత్త నిబంధనల ప్రకారం.. ఎవరైనా అమెరికాలో ఆశ్రయం కోరవచ్చు. అయితే ఆన్లైన్లో ముందే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి బార్డర్లో వివిధ రకాల పరీక్షలు చేస్తారు. ఎవరైనా అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశిస్తే వారు క్రిమినల్ విచారణను ఎదుర్కోవడంతోపాటు 5ఏళ్ల పాటు అమెరికాకు వచ్చేందుకు అవకాశం ఉండదు.
బార్డర్లో వలసదారుల సందడి
టైటిల్ 42 స్థానంలో కొత్త నిబంధన తీసుకురావడంతో సరిహద్దుకు శరణు కోరి వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. అక్కడి శిబిరాలు కిక్కిరిసిపోతున్నాయి. వీరి ఇంటర్వ్యూ చేసి అనుమతులు మంజూరు చేసేసరికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారికే తొలి ప్రాధాన్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సీబీపీ వన్ యాప్ ద్వారా అప్లై చేసుకున్నవారిన కూడా అనుమతిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

