Steve Ballmer: సంపన్నుల జాబితాలో బిల్ గేట్స్‌ను దాటేసిన మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి
Steve Ballmer: మైక్రోసాఫ్ట్ ఉద్యోగి స్టీవ్ బాల్మర్.. ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను దాటేశాడు. మైక్రోసాఫ్ట్‌లో మాజీ సీఈవోగా చేసిన బాల్మర్ ఇప్పుడు ప్రపంచంలో ఆరవ సంపన్నుడిగా రికార్డు క్రియేట్ చేశాడు.
న్యూయార్క్: మైక్రోసాఫ్ట్ ఉద్యోగి స్టీవ్ బాల్మర్(Steve Ballmer).. ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను దాటేశాడు. మైక్రోసాఫ్ట్‌లో మాజీ సీఈవోగా చేసిన బాల్మర్ ఇప్పుడు ప్రపంచంలో ఆరవ సంపన్నుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. తాజాగా మైక్రోసాఫ్ట్ షేర్లు కొత్త రికార్డులు సృష్టించాయి. ఆ షేర్ల విలువ సుమారు 21 శాతం పెరిగింది. ఓపెన్ఏఐ సంస్థతో ఇటీవల మైక్రోసాఫ్ట్ ఒప్పందం పెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్ మార్కెట్లో దూసుకెళ్తోంది.
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. మైక్రోసాఫ్ట్ షేర్లలో బాల్మర్‌కు 90 శాతం వాటా ఉన్నది. మరో వైపు బిల్ గేట్స్ మాత్రం తన సంపదలో కొంత మొత్తాన్ని కాస్కేడ్ సంస్థలో ఇన్వెస్ట్ చేశారు. రిపబ్లిక్ సర్వీసెస్ కంపెనీలోనూ అతని కొంత వాటా ఉన్నది. అయితే ఇటీవల దానాలతోనూ బిల్ గేట్స్ తన సంపదను తగ్గించుకున్నారు. వ్యక్తిగత సంపద నుంచి బిల్ గేట్స్.. తన ఫౌండేషన్ కోసం విరాళం ఇచ్చేశారు. సుమారు 60 బిలియన్ల డాలర్ల వ్యక్తిగత సంపదను ఆయన దానం చేశారు.
మిత్రుడు పౌల్ అలెన్‌తో కలిసి 1975లో మైక్రోసాఫ్ట్ సంస్థను బిల్ గేట్స్ స్థాపించారు. 2000 సంవత్సరంలో బాల్మర్‌ను ఆ కంపెనీకి సీఈవోగా నియమించారు. 2014లో స్టీవ్ బాల్మర్ రిటైర్ అయ్యారు. ఆ కంపెనీలో అతనికి అత్యధిక సంఖ్యలో షేర్లు ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

