Michelle Obama | ట్రంప్ గెలుస్తాడేమోనని భయంగా ఉంది : మిషెల్ ఒబామా
Michelle Obama | అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో 10 రోజుల్లో అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దాంతో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.
Michelle Obama : అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో 10 రోజుల్లో అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దాంతో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి మిషెల్ ఒబామా (Michelle Obama) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వస్తారేమోనని తనకు భయంగా ఉందని అన్నారు.
‘కమలా హారిస్ ఎన్నికల్లో విజయం సాధిస్తే దేశానికి ఓ అసాధారణ అధ్యక్షురాలు అవుతారు. కానీ హారిస్ కంటే ట్రంప్‌నకే అధికంగా విజయావకాశాలు ఉన్నట్లు తాజా సర్వేలు వెల్లడించాయి. ఇది హారిస్ మద్దతుదారుల్లో ఆందోళన, భయం పెంచుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ పాలనలో నెలకొన్న అస్థిరతను, ఆయన మానసిక పరిస్థితి, దుందుడుకు ఆలోచనలను మనం చూశాం. అయినా ఆయనకు ప్రజలు మద్దతివ్వడం నాలో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. అదే నిజమవుతుందేమో అని భయమవుతోంది’ అని మిషెల్ అన్నారు
అబార్షన్ హక్కుపై చట్టం చేయాలని అమెరికా కాంగ్రెస్‌ను హారిస్ కోరడాన్ని తాను సమర్థిస్తున్నానని మిషెల్ తెలిపారు. మహిళల ఆరోగ్య సంరక్షణకు ఆమె కృషి చేస్తున్నారన్నారు. అందుకు వ్యతిరేకంగా ఉన్న ట్రంప్ లాంటి వారికి అధికారం కట్టబెట్టి తనలాంటి ఎందరో స్త్రీల జీవితాలను కష్టాల్లోకి నెట్టొద్దని ఆమె కోరారు. మరోవైపు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో భాగంగా తన ప్రత్యర్థి కమలా హారిస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అమెరికాలో ఓపెన్ బోర్డర్ పాలసీని ముందుకు తీసుకురావడానికి హారిస్ ప్రయత్ని్స్తోందని ఆరోపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

