Mexico | మెక్సికో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మహిళ.. దేశ చరిత్రలో ఇదే తొలిసారి
దేశ సర్వోన్నత న్యాయస్థానం స్వతంత్రను కాపాడతానన్న జస్టిస్ నార్మ
Mexico : మెక్సీకో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తొలిసారిగా మహిళ నియమితులయ్యారు. జస్టిస్ నార్మ లుసియా పినా ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి కోసం ఆమెతో పాటు మరో న్యాయమూర్తి పోటీపడ్డారు. దాంతో ఓటింగ్ నిర్వహించారు. జస్టిస్ నార్మ 6-5 మెజారీటీతో జస్టిస్ యాస్మిన్ ఎస్క్వివెల్పై విజయం సాధించారు. జస్టిస్ యాస్మిన్ పేరును దేశాధ్యక్షుడు అండ్రెస్ మాన్యుఎల్ లొపెజ్ ఒబ్రడార్ ప్రతిపాదించారు. అయితే.. జస్టిస్ యాస్మిన్‌పై డిగ్రీ సర్టిఫికెట్ కోసం నకిలీ పేపర్ సమర్పించింది అనే ఆరోపణలు వచ్చాయి. దాంతో ఓటింగ్ ఆమెకు ఆనుకూలంగా రాలేదు. దేశ సుప్రీంకోర్టు చరిత్రలో తొలి మమిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికైన జస్టిస్ నార్మను ప్రతిపక్షాలు అభినందించాయి.
దేశ సర్వోన్నత న్యాయస్థానం స్వతంత్రను కాపాడతానని ప్రమాణస్వీకారం సందర్భంగా జస్టిస్ నార్మ అన్నారు. అంతేకాదు ఏ విషయంలోనైనా మెజారిటీ సాధించడమే తన ఉద్దేశమని ఆమె తెలిపారు. ఈ పదవిలో ఆమె నాలుగేళ్లు కొనసాగనున్నారు. మెక్సికో ప్రధాన ధర్మాసనంలో మొత్తం 11మంది సభ్యులు ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

