జెరూసలెం : హమాస్‌పై యుద్ధంలో చెమటోడుస్తున్న ఇజ్రాయెల్ సైనికులకు మెక్‌డొనాల్డ్స్ (McDonalds) ఉచితంగా భోజనం అందిస్తామని ప్రకటించడం పట్ల ఫాస్ట్‌ఫుడ్ చైన్ లక్ష్యంగా లెబనాన్ విమర్శలు గుప్పించింది. హాస్పిటల్స్‌తో పాటు ఇజ్రాయెల్ రక్షణ దళానికి చెందిన సైనికులకు వేలాది ఉచిత భోజనాలను సమకూరుస్తున్నామని మెక్‌డొనాల్డ్స్ ఇజ్రాయెల్ ప్రకటించింది.
తాము నిన్న ఆస్పత్రులు, మిలటరీ యూనిట్స్‌కు 4000 మీల్స్ అందచేశామని ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం ఇన్‌స్టాగ్రాంలో రాసుకొచ్చింది. రెస్టారెంట్స్‌కు వచ్చే సైనికులకు డిస్కౌంట్ ఇవ్వడంతో పాటు సైనికులకు రోజూ వేలాది మీల్స్ ఉచితంగా అందచేస్తున్నామని పేర్కొంది. తాము ఇందుకోసమే 5 రెస్టారెంట్లను ఓపెన్ చేశామని తెలిపింది.
మరోవైపు ఐడీఎఫ్‌కు మెక్‌డొనాల్డ్ ఉచిత మీల్స్ అందించడం సరైంది కాదని పలువురు యూజర్లు మండిపడుతున్నారు. యుద్ధాలకు పాల్పడే వారికి మెక్‌డొనాల్డ్స్ మద్దతు ఇవ్వడం తప్పని, ఫుడ్ జెయింట్‌ను బాయ్‌కాట్ చేయాలని పిలుపు ఇచ్చారు. ఇజ్రాయెల్ రక్షణ బలగాలకు మెక్‌డొనాల్డ్స్ ఉచిత మీల్స్ సరఫరా చేసి, గాజాలో ప్రజలకు అందించకుంటే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అందరూ మెక్‌డొనాల్డ్స్‌ను బాయ్‌కాట్ చేస్తారని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More :