Mass Shooting | జర్మనీలో మాస్ షూటింగ్.. ఐదుగురి మృత్యువాత..!
Mass Shooting : జర్మనీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉత్తర జర్మనీలోని స్టేడ్ పట్టణంలో సోమవారం జరిగిన మాస్ షూటింగ్(Mass Shooting)లో ఐదుగురు మరణించారు.
Mass Shooting : జర్మనీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉత్తర జర్మనీలోని స్టేడ్ పట్టణంలో సోమవారం జరిగిన మాస్ షూటింగ్(Mass Shooting)లో ఐదుగురు మరణించారు. కాల్పుల ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పులతో సంబంధమున్న ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మాస్ షూటింగ్‌కు కారణాలపై ఈ ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు.
స్టేడ్ పట్టణంలోని యువ కేంద్రం సమీపంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సిటీ మధ్యలో ఉండే ఈ ప్రాంతంలో ఈమధ్య పెద్ద సంఖ్యలో కార్యకలాపాలు సాగుతున్నాయి. దాంతో, తుపాకులతో వచ్చిన కొందరు అక్కడి వారిపై కాల్పులు జరిపారు. ఒక్కసారిగా కాల్పుల మోతతో జనాలు భయభ్రాంతులకు లోనయ్యారు.
బుల్లెట్ గాయాలతో ఐదుగురు చనిపోయారని ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్ (ఏఎఫ్పీఈ) వార్త సంస్థతో ఓ పోలీసు అధికారి చెప్పారు. సమాచారం అందగానే అక్కడి వెళ్లిన పోలీసులు.. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయండి. మీ ప్రాణాలు కాపాడుకోండి అని అక్కడి వారిని ఆదేశించినట్టు పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

