Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్లో నిరసనలపై మార్కో రూబియో
Marco Rubio | భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో గత కొన్ని రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి (US Foreign Secretary) మార్కో రూబియో (Marco Rubio) కీలక వ్యాఖ్యలు చేశారు.
Marco Rubio : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో గత కొన్ని రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి (US Foreign Secretary) మార్కో రూబియో (Marco Rubio) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ నిరసనల కట్టడికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఐక్యరాజ్యసమితి (UNO) కి చెందిన నిపుణుల బృందం ఇటీవల విమర్శించింది. దీనిపై రూబియో తాజాగా స్పందించారు.
ఒక దేశ అంతర్గత అంశాలపై తాను జోక్యం చేసుకోనని రూబియో చెప్పారు. అదే సమయంలో ప్రజాస్వామ్య దేశాల్లోని పరిస్థితుల గురించీ మాట్లాడారు. ‘ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. రాజకీయ విభేదాలు, ప్రజల అభిప్రాయాల వెల్లడి ఈ వ్యవస్థలో సర్వసాధారణం. అమెరికాలోనూ రోజూ నిరసనలు జరుగుతాయి. ఒక దేశంలో ప్రజలు బయటకు వచ్చి నిరసనలు చేస్తున్నారనేది రాజకీయ చర్చలు, అభిప్రాయ భేదాలు ఉన్నాయనడానికి సంకేతం’ అని పేర్కొన్నారు.
ఢిల్లీలో యువత నిరసనలను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం మితిమీరిన బలప్రయోగం చేస్తోందని, ఏకపక్షంగా నిర్బంధాలు చేస్తోందని ఐరాసకు చెందిన 20 మంది మానవహక్కుల నిపుణులు ఇటీవల వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వ చర్యలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఈ సందర్భంగా ఆ నిపుణులు కోరారు. ఆ బృందం ఖండనపైనే రూబియో మాట్లాడారు. భారత్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా మార్కో రూబియో గుజరాత్లోని జామ్ నగర్ వెళ్లారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తోన్న చమురుశుద్ధి కర్మాగారాన్ని సందర్శించారు.
భారత్ ఓ రిఫైనింగ్ సూపర్ పవర్ అని, భారీగా ముడి చమురును శుద్ధిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆయన కొనియాడిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతుండటం గమనార్హం. వెనెజువెలా చమురును విక్రయించేందుకు అమెరికా కొత్త మార్కెట్లను వెతుకుతోంది. ఇలాంటి సమయంలో చమురును శుద్ధిచేసే సామర్థ్యం భారీగా ఉన్న భారత్ వైపు అగ్రరాజ్యం చూపు పడింది. పశ్చిమాసియా ఘర్షణతో హర్మూజ్ జలసంధి, ఎర్ర సముద్రం మీదుగా నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దాంతో ఇంధన సరఫరాకు అంతరాయాలు కలుగుతున్నాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఈ రిఫైనరీ ఉపయోగపడుతుందనే అంచనాలు ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్లో నిరసనలపై మార్కో రూబియో
woman kills twin sons | ప్రియుడు అంగీకరించలేదని.. కవల కుమారులను చంపిన మహిళ
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

