విమానం దిగగానే ప్రయాణికులందరూ తమ లగేజీ కోసం కన్వేయర్ బెల్ట్ దగ్గర వేచిచూస్తుంటారు. తమ లగేజీ రాగానే గుర్తుపట్టి తీసుకుంటుంటారు. అయితే, లండన్ విమానాశ్రయంలో ప్రయాణికులకు భయాందోళన కలిగించే ఓ వస్తువు కనిపించింది. దీన్ని చూసి వారు షాక్ అయ్యారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ‘వైరల్హగ్’ అనే యూజర్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇందులో కన్వేయర్ బెల్ట్‌పై ఓ ప్యాకేజీ పేపర్చుట్టిన మృతదేహంలాగా తిరుగుతూ ఉంటుంది. దీన్ని చూసిన ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. అనంతరం అది బొమ్మ ఆకారంలో ఉన్న ల్యాంప్ అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. అనంతరం తమ అనుభవాలను కామెంట్ రూపంలో పంచుకుంటున్నారు.