Watch: ట్రంప్‌ను పోలిన వ్యక్తి.. పాకిస్థాన్ వీధుల్లో కుల్ఫీ అమ్మకం
Man Resembling Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పోలిన ఒక వ్యక్తి (Man Resembling Donald Trump ) పాకిస్థాన్‌లో ఉన్నాడు. అతడు ఎంచక్కా పాటలు పాడుతూ కుల్ఫీ అమ్ముతున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇస్లామాబాద్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పోలిన ఒక వ్యక్తి (Man Resembling Donald Trump ) పాకిస్థాన్‌లో ఉన్నాడు. అతడు ఎంచక్కా పాటలు పాడుతూ కుల్ఫీ అమ్ముతున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాకిస్థాన్ పంజాబ్‌లోని సాహివాల్ జిల్లాకు చెందిన కుల్ఫీలు అమ్మే వ్యక్తికి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముఖ పోలికలు ఉన్నాయి. స్థానికులు అతడ్ని ‘చాచా బగ్గా’ అని పిలుస్తారు. ప్రముఖ గాయకుడి మాదిరిగా అతడు పాటలు పాడుతుంటాడు. ‘ఆయే కుల్ఫీ… కుల్ఫీ! ఆ… ఖోవో కుల్ఫీ, కుల్ఫీ, కుల్ఫీ’ అంటూ పాటలు పాడతాడు. కుల్ఫీ అమ్మేందుకు ఆ వీధుల్లోకి తాను వచ్చినట్లు తన పాటల ద్వారా స్థానికులకు తెలియజేస్తుంటాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యింది.
కాగా, 2021లో కూడా పాకిస్థాన్‌కు చెందిన ఈ కుల్ఫీ విక్రేత ఇంటర్నెట్లో హల్చల్ చేశాడు. డొనాల్డ్ ట్రంప్ మాదిరి పోలికలున్న అతడు పాటలు పాడుతూ తన ఐస్ క్రీం బండి ద్వారా కుల్ఫీలు అమ్ముతున్న వీడియో క్లిప్ నాడు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది నెటిజన్లను షాక్ చేయడంతోపాటు ఎంతో ఆకట్టుకున్నది. పాకిస్థానీ గాయకుడు షెహజాద్ రాయ్ కూడా ఈ వీడియో క్లిప్‌ను నాడు షేర్ చేశారు. ‘వాహ్ కుల్ఫీ వాలీ భాయ్, క్యా బాత్ హై..’ అంటూ అతడి పాటలను ప్రశంసించారు.
Wah. Qulfi walay bhai, Kya baat ha کھاۓ بغیر مزا آ گیا pic.twitter.com/YJeimzhboJ
— Shehzad Roy (@ShehzadRoy) June 10, 2021
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Donald Trump
- Kulfi
- MAN
- Pakistan
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

