రోమన్, ఆగస్టు 25: ఇటలీకి చెందిన ఓ వ్యక్తికి ఒకేసారి మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవీ సోకినట్టు నిర్ధారణ అయింది. 36 ఏండ్ల ఆ వ్యక్తి జూన్ 16 నుంచి 20 వరకు స్పెయిన్ పర్యటనకు వెళ్లాడు.
అక్కడ చాలామంది పురుషులతో అసురక్షిత సెక్స్‌లో పాల్గొన్నాడు. తిరిగి వచ్చాక జూలై 2న తీవ్ర జ్వరం, అలసట, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉండటంతో పలు రకాల పరీక్షలు నిర్వహించడంతో ఒకేసారి మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవీ సోకినట్టు నిర్ధారించారు. ఇలా మూడు వ్యాధులు ఒకే వ్యక్తిలో ఒకేసారి నిర్ధారణ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బాధితుడు వెంటనే కాటలీనాలోని శాన్ మాక్రో దవాఖానకు వెళ్లగా, ఐసొలేషన్ కేంద్రంలో ఉంచి చికిత్స అందించారు. కొవిడ్, మంకీపాక్స్ పూర్తిగా నయం కాగా జూలై 11న డిశ్చార్జి చేశారు.