6 లక్షల తేనెటీగలు శరీరాన్ని చుట్టుముట్టినా బతికి బట్టకట్టాడు: వైరల్ వీడియో
ఒకటి కాదు.. రెండు కాదు.. 6 లక్షలకు పైగా తేనెటీగలు ఆ వ్యక్తి శరీరాన్ని చుట్టుముట్టాయి. చివరికి అతడి ముఖం కూడా కనిపించకుండా అతడిని చుట్టేశాయి. అయినా కూడా అతడికి ఏం కాలేదు. ఒక్క తేనెటీగ కూడా అతడిని కుట్టలేదు. మనిషి ఏమాత్రం కనిపించకుండా.. తేనెటీగలు అతడిని చుట్టేసినా అతడికి ఏం కాకపోవడం విశేషం. నిజానికి ఇలాంటి ఫీట్ చేయడం అనేది సాహసం అనే చెప్పాలి. ఇటువంటి సాహసం చేసి గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు చైనాకు చెందిన రువాన్ లియాంగ్మింగ్.

63.7 కిలోల బరువుతో 637,000 తేనెటీగలు అతడి శరీరం మీద వాలాయి. అందులో 60 రాణి తేనెటీగలు కూడా ఉన్నాయి. రాణి తేనెటీగలు ఎక్కడ ఉంటే.. అక్కడికి మామూలు తేనెటీగలు వెళ్తుంటాయి. వాటికి ఆకర్షితులవుతుంటాయి. అన్ని లక్షల తేనెటీగలు అతడిని చుట్టుముట్టినా ఏమాత్రం భయపడకుండా అలాగే నిలబడి రికార్డు క్రియేట్ చేశాడు రువాన్.
నిజానికి ఈ ఫీట్‌ను రువాన్ 2016లోనే సాధించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు తమ యూట్యూబ్ చానెల్లో అప్లోడ్ చేశారు. కానీ.. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒకసారి తేనెటీగలు చుట్టుముట్టాక.. ఆ వ్యక్తి కదలకూడదు.. ఏం మాట్లాడకూడదు. సైలెంట్‌గా అలాగే ఉండాల్సి ఉంటుంది. లేదంటే అవి ఏదో ప్రమాదం ఉందని పసిగట్టి కుట్టే ప్రమాదం ఉంటుంది. మొత్తానికి అవి కుట్టకుండా జాగ్రత్త పడుతూ నిలబడాల్సి ఉంటుంది. అన్ని లక్షల తేనెటీగలు ఒకేసారి చుట్టుముట్టినా ఏమాత్రం బెదరకుండా అలాగే నిలబడి ఈ ఫీట్‌ను పూర్తి చేసిన రువాన్ను చూసి నెటిజన్లు హ్యేట్సాఫ్ అంటున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

